ETV Bharat / city

అన్నదాత ఆత్మహత్యల్లో తెలంగాణకు ఆరో స్థానం - suicides in telangana

పంట నష్టాలు, ఏటేటా పెట్టుబడులు పెరగడం, గిట్టుబాటు ధరలు లేకపోవడం, అప్పులు.. ఇలా కారణాలేవైనా... అన్నదాత బలవన్మరణాలు మాత్రం ఆగడం లేదు.

అన్నదాత ఆత్మహత్యల్లో తెలంగాణకు ఆరో స్థానం
author img

By

Published : Nov 10, 2019, 5:06 AM IST

Updated : Nov 10, 2019, 7:02 AM IST

వ్యవసాయ రంగంపై ఆధారపడిన వారు అత్యధికంగా ఆత్మహత్యలు చేసుకున్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ ఆరో స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్​ నాలుగో స్థానంలో ఉంది. మొదటిస్థానంలో మహారాష్ట్ర నిలిచింది.

2016లో ప్రమాద మరణాలు - ఆత్మహత్యలకు సంబంధించి జాతీయ నేర గణాంక సంస్థ ( ఎన్​సీఆర్​బీ) తాజాగా విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది.

2016 గణాంకాల ప్రకారం

  1. దేశవ్యాప్తంగా బలవన్మరణాలకు పాల్పడ్డ రైతులు, వ్యవసాయ కూలీలు : 11,379
  2. తెలంగాణకు చెందిన వారు : 5.66 శాతం
  3. ఏపీకి చెందిన వారు : 7.06 శాతం

ఆంధ్రప్రదేశ్​తో పోలిస్తే తెలంగాణలో సొంత భూమి కలిగిన రైతులు, కౌలు రైతులు ఎక్కువ మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు.

  • తెలంగాణలో ఆత్మహత్యలు :

పురుషులు : 572

మహిళలు : 73 మంది

  • ఆంధ్రప్రదేశ్​లో ఆత్మహత్యలు

పురుషులు : 730

మహిళలు : 74

ఆత్మహత్యల్లోనూ ఆరో స్థానమే :

దేశవ్యాప్తంగా అత్యధికంగా ఆత్మహత్యలు జరుగుతున్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ ఆరో స్థానం, ఆంధ్రప్రదేశ్​ తొమ్మిదో స్థానంలో ఉన్నాయి.

2016లో దేశవ్యాప్తంగా 1,31,008 మంది ఆత్మహత్య చేసుకోగా... వారిలో 4.6 శాతం మంది తెలంగాణకు చెందినవారు ఉన్నారు. మృతుల్లో కూలీలు, గృహిణులే ఎక్కువ.

  • దేశవ్యాప్తంగా... 1,31,008

పురుషులు : 88,997 ; మహిళలు : 41,997 ; ట్రాన్స్​ జెండర్స్ : 14

  • తెలంగాణలో 9,019

పురుషులు : 6,316 ; మహిళలు : 2,701 ; ట్రాన్స్​ జెండర్స్ : 2

అత్యధికంగా ఆత్మహత్యలు నమోదైన రాష్ట్రాలలో మొదటి మూడు స్థానాల్లో మహారాష్ట్ర (17, 195), తమిళనాడు (15,182), పశ్చిమ్​ బంగా (13, 451) ఉన్నాయి.

  • వ్యవసాయంపై ఆధారపడి ఎక్కువ మంది ఆత్మహత్యలు చేసుకున్న రాష్ట్రాలు
మహారాష్ట్ర 3,661
కర్ణాటక 2,079
మధ్యప్రదేశ్ 1,321
ఆంధ్రప్రదేశ్ 804
ఛత్తీస్​గఢ్ 682
తెలంగాణ 645

Intro:Body:Conclusion:
Last Updated : Nov 10, 2019, 7:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.