ETV Bharat / city

ఇంటర్ పాత విద్యార్థులకు ఊరట - తెలంగాణ ఇంటర్ పరీక్షల వార్తలు

ఇంటర్‌ ఫెయిలైన విద్యార్థులు కొత్త ప్రశ్నాపత్రాలతోనే పరీక్షలు రాయనున్నారు. ఇప్పుడున్న విధానాన్ని పాత విద్యార్థులకు వర్తింపజేయనున్నారు. మే లోనే మెుదటి, ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఉండనున్నాయి.

exams
exams
author img

By

Published : Feb 19, 2021, 7:57 AM IST

గతంలో ఇంటర్‌ ఫెయిలైన విద్యార్థులకు కొత్త విధానంలో రూపొందించే ప్రశ్నాపత్రాలతోనే పరీక్షలు నిర్వహించనున్నారు. మే 1 నుంచి జరిగే ఇంటర్‌ వార్షిక పరీక్షలకు కరోనా పరిస్థితుల నేపథ్యంలో 30 శాతం సిలబస్‌ తగ్గించడంతో పాటు ప్రశ్నాపత్రాల్లో సగం ఛాయిస్‌ ఇచ్చేలా మార్పులు చేశారు. ఇదే విధానాన్ని పాత విద్యార్థులకు వర్తింపజేయనున్నట్లు అధికారులు తెలిపారు. గతేడాది మార్చిలో జరిగిన ఇంటర్‌ వార్షిక పరీక్షల్లో 4,80,555మంది... తొలి ఏడాది పరీక్షలు రాయగా.. వారిలో 1,91,172 మంది ఫెయిలయ్యారు.

ఆయా విద్యార్థులు ఇంటర్‌.... రెండు సంవత్సరాల పరీక్షలు ఒకేసారి రాయాల్సి ఉన్నందున ఒత్తిడికి లోనుకాకుండా ఈ అవకాశం కల్పించినట్లు అధికారులు తెలిపారు. వారికి మే లో జరిగే ద్వితీయ సంవత్సరం పరీక్షలతో పాటే నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పరీక్షల్లో 70శాతం సిలబస్‌ 50శాతం ఛాయిస్‌ వర్తింపజేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అటు గతేడాది మార్చిలో ఇంటర్‌ ద్వితీయ వార్షిక పరీక్ష ఫీజులు చెల్లించని... వేల మంది విద్యార్థులకు కొత్త సిలబస్‌ ప్రకారం పరీక్షలు నిర్వహించనున్నారు.

ఇదీ చదవండి: రాష్ట్రం సాధించిన విజయాలతో నీతిఆయోగ్​కు సీఎం కేసీఆర్​...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.