ఆక్రమణలకు గురైన వక్ఫ్ బోర్డు ఆస్తులు.. ఎన్ని స్వాధీనం చేసుకున్నారనే వివరాలు లేకపోవడం పట్ల హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆస్తులను కాపాడటానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారా..? అందులో ఎంత మంది సభ్యులు ఉన్నారు..? ఇప్పటి వరకు ఎన్ని ఆస్తులను తిరిగి స్వాధీనం చేసుకున్నారు..? అని ప్రభుత్వాన్ని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది.
వక్ఫ్ బోర్డు స్థలాల ఆక్రమణపై హైకోర్టులో విచారణ సందర్భంగా.. 2186 ఆస్తులు ఆక్రమణకు గురైనట్లు గుర్తించామని హైకోర్టుకు.. ప్రభుత్వం తెలిపింది. ఈ స్థాయిలో ఆక్రమణలవుతున్నా ఏం చేస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది. వక్ఫ్ బోర్డు ఆస్తులకు సంబంధించి జిల్లాల వారీగా పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించింది. విచారణను జూన్ 10కి వాయిదా వేసింది.
ఇవీచూడండి: వక్ఫ్‌బోర్డు సీఈఓకు చట్టాలపై అవగాహనలేదు.. ఆయన అవసరమా?