రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల సహాయక చర్యల్లో సుమోటోగా జోక్యం చేసుకోవాలన్న అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది.
హైదరాబాద్‌లో భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. ప్రాణనష్టం జరిగిందని న్యాయవాది నరేష్‌రెడ్డి ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. సుమోటో ప్రజాప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించి ప్రభుత్వానికి తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
ప్రభుత్వం.. రెండు రోజుల క్రితమే ప్రజలను అప్రమత్తం చేసిందని.. అధికారులు సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారని ధర్మాసనం పేర్కొంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఊహించుకొని జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ప్రభుత్వ సహాయక చర్యల్లో ఏవైనా లోపాలు కనిపిస్తే.. పిటిషన్ దాఖలు చేయవచ్చునని సూచించింది.
ఇవీచూడండి: రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు... జనజీవనం అస్తవ్యస్థం