BJP MLAs appeal to Telangana High Court bench : శాసనసభ సమావేశాల నుంచి సస్పెన్షన్ చేసిన వ్యవహారంపై హైకోర్టు ధర్మాసనానికి భాజపా ఎమ్మెల్యేలు అప్పీల్ చేశారు. అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు తీసుకోవడం లేదని ఉన్నత న్యాయస్థానం ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు ఇవ్వాలని జ్యుడిషీయల్ రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. తాఖీదులు చేరేలా చూడాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌ను ఆదేశిస్తూ.. విచారణ సాయంత్రం నాలుగు గంటలకు వాయిదా వేసింది.
అంతరాయం కల్గించారని..
Telangana HC on BJP MLAs suspension case: రాష్ట్ర బడ్డెట్ ప్రవేశపెట్టిన రోజు.. భాజపా ఎమ్మెల్యేలు వెల్‌లోకి వెళ్లి సభా కార్యకలాపాలకు అంతరాయం కల్గించారంటూ ముగ్గురిపై అధికారపక్షం వేటు వేసింది. అసెంబ్లీ సెషన్స్ ముగిసే వరకు భాజపా ఎమ్మెల్యేలు.. ఈటల రాజేందర్, రఘునందన్‌రావు, రాజాసింగ్ సభకు రాకుండా సస్పెన్షన్ విధించింది.
నోటీసులు తీసుకోవడం లేదు..
అధికారపక్షం తీరును సవాల్ చేస్తూ భాజపా ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు. సభా నియమాలకు విరుద్ధంగా వ్యవహరించారని ఉన్నత న్యాయస్థానానికి ఫిర్యాదు చేశారు. వారి పిటిషన్‌పై వాదనలు జరిగాయి. అనేక ప్రయత్నాలు చేసినా అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు అందజేయలేకపోయామని హైకోర్టు రిజిస్ట్రీకి తెలిపారు. సస్పెన్షన్ తీరు రాజ్యాంగానికి, శాసనసభ నియమావళి విరుద్ధంగా ఉందని వాదించారు. కనీసం సస్పెన్షన్ ఉత్తర్వులు, వీడియో రికార్డింగులు కూడా ఇవ్వడం లేదన్నారు. సస్పెన్షన్ ఎత్తివేసి సమావేశాలకు హాజరయ్యేందుకు అనుమతించేలా ఆదేశాలివ్వాలని కోరారు.
కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశం
అసెంబ్లీ వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకోవద్దని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ సూచించగా.. సస్పెన్షన్‌పై స్టే ఇచ్చేందుకు, ప్రొసీడింగ్స్ ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. పూర్తిస్థాయి విచారణ చేపట్టేందుకు కౌంటర్లు దాఖలు చేయాలని అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశిస్తూ మరోసారి నోటీసులు జారీ చేసింది.
- ఇదీ చదవండి : అందుకే భాజపా ఎమ్మెల్యేల సస్పెన్షన్: హరీశ్‌రావు