ETV Bharat / city

సాదాబైనామాల క్రమబద్ధీకరణకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత దరఖాస్తు చేసుకున్న వారి సాదా బైనామా భూముల క్రమబద్దీకరణ ప్రక్రియ చేపట్టవద్దని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అంతకు ముందు వచ్చిన దరఖాస్తులు పరిశీలించేందుకు అనుమతించిన ఉన్నత న్యాయస్థానం... ప్రక్రియ తుది తీర్పునకు లోబడి ఉండాలని స్పష్టం చేసింది. రద్దైన ఆర్వోఆర్ చట్టం ప్రకారం సాదాబైనామా భూములను ఎలా క్రమబద్ధీకరిస్తారని ప్రశ్నించింది.

telangana high court interim orders on sadabainama regularizations
సాదాబైనామాల క్రమబద్ధీకరణకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
author img

By

Published : Nov 11, 2020, 3:00 PM IST

రిజిస్ట్రేషన్ లేని భూముల క్రమబద్ధీకరణ కోసం అక్టోబరు 29 తర్వాత అందిన దరఖాస్తుల పరిశీలన నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. సాదాబైనామా భూముల క్రమబద్ధీకరణను సవాల్ చేస్తూ నిర్మల్ జిల్లా రైతు షిండే దేవిదాస్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి. విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది. కొత్త రెవెన్యూ చట్టం అక్టోబరు 29న అమల్లోకి వచ్చిందని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ తెలిపారు. అక్టోబరు 10 నుంచి 29 వరకు 2 లక్షల 26 వేల 693 దరఖాస్తులు వచ్చాయని.. అక్టోబరు 29 నుంచి దరఖాస్తుల చివరి రోజైన నిన్నటి వరకు 6 లక్షల 74 వేల 201 దరఖాస్తులు వచ్చాయని అడ్వకేట్ జనరల్ వివరించారు.

చట్టాలకు లోబడే ఉండాలి..

కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత పాత ఆర్వోఆర్ చట్టం ప్రకారం క్రమబద్ధీకరణ ప్రక్రియ ఎలా నిర్వహిస్తారని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. పేద చిన్న, సన్నకారు రైతులకు ప్రయోజనం కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఏజీ పేర్కొన్నారు. అయితే ప్రభుత్వ విధాన పరమైన నిర్ణయాలు... చట్టాలకు లోబడే ఉండాలని హైకోర్టు స్పష్టం చేసింది. చట్టబద్ధత లేని జీవోలను ఎలా అమలు చేస్తారని ప్రశ్నించింది. పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేసేందుకు రెండు వారాలు గడువు ఇవ్వాలని ఏజీ కోరారు.

దుర్వినియోగం చేస్తే..?

మరోవైపు పాత చట్టం ఉన్నప్పుడు దరఖాస్తు చేసుకున్న 2 లక్షల 26 వేల 693 సాదాబైనామా క్రమబద్ధీకరణ కూడా చేయవద్దని పిటిషనర్ తరఫు న్యాయవాది నరేష్ కోరారు. సాదా బైనామాల కోసం 2016లో ఓ సారి అవకాశం ఇచ్చారని... ఇప్పుడు పాత తేదీలతో కాగితాలు సృష్టించి దుర్వినియోగం చేసే అవకాశాలు ఉన్నాయని అనుమానం వ్యక్తం చేశారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు... అక్టోబరు 29 తర్వాత చేసుకున్న దరఖాస్తులకు సంబంధించిన క్రమబద్ధీకరణ ప్రక్రియను తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు చేపట్టవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అంతకు ముందు అందిన దరఖాస్తుల ప్రక్రియ నిర్వహించవచ్చునని... కాకపోతే తుది తీర్పునకు లోబడి ఉండాలని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: 'పండుగలు ముఖ్యమే.. టపాసులపై నిషేధమూ సరైనదే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.