డెంగీ వంటి సీజనల్ వ్యాధుల నియంత్రణకు (SEASONAL DISEASES IN TELANGANA) ఆచరణ సాధ్యమయ్యే కార్యచరణ ప్రణాళికలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు(TELANGANA HIGH COURT) ఆదేశించింది. డెంగీ నియంత్రణ చర్యలు చేపట్టడం లేదన్న ప్రజాప్రయోజన వ్యాజ్యంపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ టి.వినోద్ కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది.
వర్షాకాలంలో దోమల వ్యాప్తి వల్ల జ్వరాలు ప్రబలుతాయని తెలిసినా.. చర్యలు తీసుకోవాలని ఏటా చెప్పాలా అంటూ ధర్మాసనం (TS HIGH COURT ON SEASONAL DISEASES) వ్యాఖ్యానించింది. హైకోర్టు ఆదేశాలతో ఏర్పాటైన కమిటీ ఇప్పటి వరకు ఎన్నిసార్లు సమావేశమైందో తెలపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రంలో విషజ్వరాల నియంత్రణపై ఇటీవల ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించారని ఏజీ ప్రసాద్.. న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన కోర్టు.. ఇలాంటి విషయాల్లోనూ ముఖ్యమంత్రి స్థాయిలో ఎందుకు చెప్పాలని.. అధికార యంత్రాంగం ఎందుకు చర్యలు తీసుకోరాదని ప్రశ్నించింది. సమస్యను తీవ్రంగా పరిగణించి స్థానిక సంస్థలు, వైద్యారోగ్య శాఖతో సమన్వయం చేసుకొని నివారణ చర్యల ప్రణాళికలు రూపొందించాలని కోర్టు స్పష్టం చేసింది. ఆచరణ సాధ్యమయ్యే ప్రణాళిక ఈనెల 25లోగా సమర్పిస్తే.. ఈనెల 29 నాటికి ఆదేశాలు జారీ చేస్తామని ధర్మాసనం తెలిపింది.
ఇదీచూడండి: Tollywood Drugs Case: డ్రగ్స్ కేసులో నేడు ఈడీ విచారణకు హీరో తరుణ్