రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ఎలాంటి చర్యలు చేపట్టారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. కరోనా జాడలు కనిపించడం ఆందోళన కలిగిస్తోందని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. డెంగ్యూ, స్వైన్ ఫ్లూ వంటి సీజనల్ జ్వరాలను అరికట్టేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై హైకోర్టులో ఇవాళ మరోసారి విచారణ జరిగింది.
ప్రభుత్వం గతంలో సమర్పించిన నివేదికను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ ఎ.అభిషేక్ రెడ్డిల ధర్మాసనం పరిశీలించింది. స్వైన్ ఫ్లూపై సాంకేతిక కమిటీ నియమించారా లేదా అని ప్రశ్నించింది. మరోవైపు ఆందోళన కలిగిస్తోన్న కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఏ విధంగా సిద్ధంగా ఉందని అడిగింది.
కరోనా, స్వైన్ ఫ్లూపై అవగాహన, నివారణ చర్యలపై ఈనెల 26లోగా నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 27కి వాయిదా వేసింది.
ఇదీ చూడండి: వైద్యులపైనే కరోనా పంజా - చైనాలో ఆరుగురు మృతి