ETV Bharat / city

'ఆక్సిజన్, టీకాలు, రెమ్​డెసివిర్​ విషయంలో కేంద్రం వివక్ష'

రాష్ట్రంలో రోజుకు 260 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరముంటే.. కేంద్రం మాత్రం 40 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ మాత్రమే కేటాయించిందని రాష్ట్ర ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. తమిళనాడు నుంచి రాష్ట్రానికి 30 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కేటాయించారని.. ఆ రాష్ట్రం ఒక్క టన్ను కూడా ఇవ్వబోమని చెబుతోందని చెప్పారు. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత ఏర్పడితే కేంద్రానిదే బాధ్యత అని అన్నారు.

minister etela, minister etela rajender
మంత్రి ఈటల, మంత్రి ఈటల రాజేందర్, తెలంగాణ కరోనా వార్తలు
author img

By

Published : Apr 22, 2021, 2:46 PM IST

ఆక్సిజన్ నిల్వలు, రెమ్​డెసివిర్ విషయంలో కేంద్రం తెలంగాణపై వివక్ష చూపుతోందని రాష్ట్ర ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ ఆరోపించారు. గుజరాత్​కు 10 రోజుల్లో లక్షా 63వేల డోసుల రెమ్​డెసివిర్ ఇచ్చారని.. రాష్ట్రంలో తయారయ్యే రెమ్​డెసివిర్​ను పూర్తిగా రాష్ట్రానికే కేటాయించాలని కోరామని తెలిపారు. కొవిడ్ టీకాల పంపిణీల్లోనూ కేంద్రం తెలంగాణతో దారుణంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రోజుకు 10 లక్షల టీకాలు ఇచ్చే సామర్థ్యం రాష్ట్రానికుందని స్పష్టం చేశారు.

కేంద్రానిదే బాధ్యత

రాష్ట్రంలో రోజుకు 260 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరముంటే.. కేంద్రం మాత్రం 40 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ మాత్రమే కేటాయించిందని మంత్రి తెలిపారు. తమిళనాడు నుంచి రాష్ట్రానికి 30 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కేటాయించారని.. ఆ రాష్ట్రం ఒక్క టన్ను కూడా ఇవ్వబోమని చెబుతోందని చెప్పారు. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత ఏర్పడితే కేంద్రానిదే బాధ్యత అని అన్నారు.

పరీక్షల సంఖ్య పెంచాల్సిందే..

రోజుకు లక్షా 50వేల వరకు కరోనా నిర్ధరణ పరీక్షలు చేస్తున్నామన్న ఈటల.. ఆర్టీపీసీఆర్ పరీక్షల ఫలితాలకు ఆలస్యమవుతోందన్నారు. రాష్ట్రంలో రోజుకు 30వేల ఆర్టీ పీసీఆర్ పరీక్షలు మాత్రమే చేయగలమని తెలిపారు. కరోనా వ్యాప్తి అరికట్టాలంటే పరీక్షల సంఖ్య పెంచాల్సిందేనని చెప్పారు.

600 మందికి పైగా ఐసీయూలో..
'ఆక్సిజన్, టీకాలు, రెమ్​డెసివిర్​ విషయంలో కేంద్రం వివక్ష'

కరోనా వైరస్ చాలా ప్రభావంతంగా ఉందని మంత్రి అన్నారు. నాలుగైదు రోజుల్లోనే ఎక్కువ ప్రభావం చూపుతోందని తెలిపారు. కరోనా రోగులు పరిస్థితి తీవ్రం కాకముందే ఆస్పత్రులకు వెళ్లాలని సూచించారు. కొన్ని కార్పొరేట్ ఆస్పత్రులు డబ్బు కట్టట్లేదని గాంధీకి పంపుతున్నాయన్న ఈటల.. గాంధీ ఆస్పత్రిలో మొదటిసారి 600మందికిపైగా ఐసీయూలో ఉన్నారని వెల్లడించారు. పరిస్థితి తీవ్రం దాల్చిన తర్వాత గాంధీకి పంపుతున్నారని చెప్పారు. ప్రైవేట్ ఆస్పత్రులు మొదట్నుంచే రోగుల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆదేశించారు.

ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు భయంతో బతుకుతున్నారని మంత్రి ఈటల అన్నారు. తొలి దశను సమర్థంగా ఎదుర్కొన్న తెలంగాణ.. రెండో దశను ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. హైదరాబాద్​లో 60-70 శాతం ఇతర రాష్ట్రాల కరోనా బాధితులే ఉన్నారని తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.