మొదట్లో కరోనా కేసులు బయటపడినప్పుడు అభివృద్ధి చెందిన దేశాలు సహా అందరూ భయపడ్డారని.. మనం మాత్రం ధైర్యంగా ఎదుర్కొన్నామని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన 108 ఉద్యోగుల రెండో మహాసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
గత ఏడు నెలలుగా కరోనా విజృంభిస్తున్నా.. కంటి మీద కునుకు లేకుండా కర్తవ్య నిర్వహణలో 108 ఉద్యోగులు నిమగ్నమయ్యారని ఈటల కితాబిచ్చారు. ఉద్యోగుల పనిగంటలు, జీతభత్యాలు, పీఎఫ్ వంటి అంశాలపై త్వరలోనే స్పష్టత ఇస్తామన్నారు.
రాబోయే కాలంలో ప్రభుత్వ వైద్యమై పూర్తిస్థాయిలో అందాలని.. అందుకు అనుగుణంగానే సీఎం కేసీఆర్ ఉపసంఘాన్ని ఏర్పాటుచేసినట్లు తెలిపారు. కేసీఆర్ కిట్ల వచ్చిన తర్వాత.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసూతి కేసులు పెరిగాయని.. కల్యాణ లక్ష్మి పథకం తర్వాత బాల్య వివాహాలు ఆగిపోయాయని ఈటల అన్నారు.
ఇవీచూడండి: 'వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి అప్పుడే'