ETV Bharat / city

oxygen concentrators : వైద్యశాఖ కీలక నిర్ణయం.. ఇళ్ల వద్దకే ప్రాణవాయువు - ఇంటికే ఆక్సిజన్ కాన్సన్​ట్రేటర్లు

రెండో దశ కరోనా.. ప్రాణవాయువు విలువేంటో తెలిసేలా చేసింది. ఆ సమయంలో ఆక్సిజన్ కాన్సన్​ట్రేటర్ల(oxygen concentrators)కు డిమాండ్ ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున వాటిని కొనుగోలు చేసింది. ప్రస్తుతానికి కొవిడ్ తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడు అవి నిరుపయోగంగా ఉన్నాయి. వీటిని సద్వినియోగం చేసుకోవడంపై దృష్టి సారించిన వైద్యశాఖ అవసరమైన వారికి ఇళ్ల వద్దకే ఆక్సిజన్ కాన్సన్​ట్రేటర్లను పంపే కార్యక్రమానికి నాంది పలుకుతోంది.

oxygen concentrators
oxygen concentrators
author img

By

Published : Oct 11, 2021, 7:44 AM IST

కొవిడ్‌ చికిత్సలో భాగంగా కొందరికి ప్రాణవాయువు(Oxygen) వినియోగిస్తారు. మరికొందరికి చికిత్స అనంతరం కూడా దీర్ఘకాలంగా ఆక్సిజన్‌ అవసరమవుతుంది. ఇలాంటి వారికి ఇళ్ల వద్దనే ప్రాణ వాయువును అందించాలని వైద్యారోగ్యశాఖ నిర్ణయించింది. ఇందుకోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలోనే ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఇతర వ్యాధిగ్రస్తులకు కూడా..

రెండోదశ కొవిడ్‌ విజృంభణతో ఆక్సిజన్‌ ప్రాధాన్యం ఏమిటో తెలిసొచ్చింది. ఈ సమయంలోనే ప్రాణవాయువు కాన్సన్‌ట్రేటర్ల(oxygen concentrators)కు డిమాండ్‌ ఏర్పడింది. ప్రభుత్వం కూడా పెద్దఎత్తున కొనుగోలు చేసింది. స్వచ్ఛంద సంస్థల నుంచీ విరాళాలొచ్చాయి. ప్రస్తుతం వైద్యఆరోగ్యశాఖ వద్ద సుమారు 4500 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు(oxygen concentrators) అందుబాటులో ఉన్నాయి. వీటిని రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాంతీయ, జిల్లా, బోధనాసుత్రులకు సరఫరా చేసింది.

ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రుల్లోని 27 వేల పడకలకు ఆక్సిజన్‌ను పైపులైన్ల ద్వారా అందించే ప్రక్రియ కొనసాగుతుండగా.. ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు(oxygen concentrators) అదనపు బలాన్నిచ్చాయి. అనుకోని పరిస్థితుల్లో పైపులైను వ్యవస్థ ద్వారా ప్రాణవాయువు సరఫరాలో అవాంతరాలు ఎదురైతే.. ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్ల ద్వారా వెంటనే అందించడానికి వీలవుతుంది. కొన్ని నెలలుగా కొవిడ్‌ తగ్గుముఖం పట్టడంతో ఇవి నిరుపయోగంగా ఉన్నాయి. అందుకే వీటిని సద్వినియోగం చేయడంపై ఆరోగ్యశాఖ దృష్టిపెట్టింది. ప్రయోగాత్మకంగా మహబూబాబాద్‌ జిల్లాలో అందుబాటులో ఉన్న ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను(oxygen concentrators) రోగుల ఇళ్ల వద్దకే పంపించి వినియోగిస్తున్నారు. క్షేత్రస్థాయి వైద్యసిబ్బంది తమ విధుల్లో తలమునకలై ఉండడంతో.. ఓ ప్రైవేట్‌ సంస్థకు నిర్వహణ బాధ్యతలను అప్పగించారు. వీటిని ప్రైవేట్‌ నుంచి అద్దెకు తీసుకొస్తే రోజుకు రూ.5వేలు- 10వేల వరకూ వసూలు చేస్తున్నారు. ప్రభుత్వమే ఉచితంగా సరఫరా చేస్తుండడంతో రోగులకు ఆ మేరకు ఆర్థిక భారం తప్పింది. దీన్ని ఆదర్శంగా తీసుకొని అన్ని జిల్లాల్లోనూ ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను(oxygen concentrators) అవసరమైన రోగులకు ఇళ్ల వద్దకే అందజేయాలని నిర్ణయించింది. వీటి నిర్వహణ బాధ్యతలను ప్రైవేట్‌కు అప్పగించాలని యోచిస్తోంది.

కరోనా రోగులకే కాకుండా క్యాన్సర్‌ తరహాలో ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ ఇళ్ల వద్ద ఆక్సిజన్‌ సేవలు అవసరమైన వారికి కూడా వీటిని వినియోగించాలని ఆరోగ్యశాఖ నిర్ణయం తీసుకొంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న అన్ని ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్ల సమాచారాన్ని ఒక ప్రత్యేక యాప్‌లో పొందుపర్చారు. ఏయే ఆసుపత్రుల్లో ఎన్ని ఉన్నాయి? అందులో ఎన్ని వినియోగంలో ఉన్నాయి? తదితర సమాచారాన్ని ఎప్పటికప్పుడూ పొందుపరుస్తారు. తద్వారా వినియోగం కూడా పారదర్శకంగా ఉండేందుకు దోహదపడుతుందని వైద్యవర్గాలు తెలిపాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.