ETV Bharat / city

'ర్యాలీలు, సభల అనుమతులకు 24 గంటల ముందే దరఖాస్తు' - telangana graduate mlc elections campaign

పట్టభద్రుల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ర్యాలీలు, సభలు, పాదయాత్రలు తదితర అనుమతుల కోసం 24 గంటల ముందే దరఖాస్తు చేసుకోవాలని ఎన్నికల పరిశీలకులు హర్​ప్రీత్ సింగ్ సూచించారు. జీహెచ్​ఎంసీ ప్రధాన కార్యాలయంలో మహబూబ్​నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎన్నికకు పోటీ చేసే అభ్యర్థులతో సమావేశమయ్యారు.

Telangana Graduates' MLC Election Campaign
తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం
author img

By

Published : Feb 27, 2021, 6:55 AM IST

జీహెచ్​ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఎన్నికల పరిశీలకులు హర్​ప్రీత్ సింగ్.. మహబూబ్​నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎన్నికలకు పోటీ చేసే అభ్యర్థులతో సమావేశమయ్యారు. ఎన్నికల నియమ నిబంధనలపై వారితో చర్చించారు. ఎన్నికల నియమావళిపై రూపొందించిన పుస్తకాన్ని రిటర్నింగ్ అధికారి ప్రియాంక.. అభ్యర్థులకు అందజేశారు.

పట్టభద్రుల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు.. ర్యాలీలు, సభలు, పాదయాత్రలు తదితర అనుమతుల కోసం 24 గంటల ముందే సంబంధిత రిటర్నింగ్ అధికారి లేదా జిల్లా కలెక్టర్​ వద్ద దరఖాస్తు చేసుకోవాలని హర్​ప్రీత్ సూచించారు. ఎన్నికల సామగ్రి పంపిణీ, కౌంటింగ్ కేంద్రంగా ఎల్బీ స్డేడియాన్ని ఎంచుకున్నట్లు తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ కోసం వికలాంగులు, 80 ఏళ్లు పైబడినవారు, కొవిడ్ వచ్చి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారు, హోంక్వారంటైన్​లో ఉన్న వారు జిల్లా వైద్యాధికారి ధ్రువీకరణతో అర్హులను వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.