రాజ్‌భవన్‌లో బోనాల వేడుకలు ఘనంగా జరిగాయి. బోనం ఎత్తిన గవర్నర్ తమిళిసై... మేళతాళాలతో తమ నివాసం నుంచి బయలుదేరారు. రాజ్‌భవన్ ప్రాంగణంలోని అమ్మవారి గుడి వరకు ఊరేగింపుగా వెళ్లి.. బోనం సమర్పించారు. రాష్ట్రంతో పాటు దేశం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నారు. మరింత అభివృద్ధిని సాధించాలని ప్రార్థించినట్లు తమిళిసై తెలిపారు. ఈ వేడుకలో గవర్నర్ కుటుంబ సభ్యులు, రాజ్‌భవన్ సిబ్బంది, రాజ్‌భవన్ పరివార్‌కు చెందిన మహిళలు పాల్గొని అమ్మవారికి బోనం సమర్పించారు.
అంతకుముందు.. తల్లి పాల ముగింపు వారోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్ పాల్గొన్నారు. తల్లి పాలు దానం చేసిన 26 మందికి ధాత్రి మదర్స్ మిల్క్ ఆధ్వర్యంలో... 'మా యశోదరా అవార్డ్స్' అందజేశారు. నిలోఫర్ ఆస్పత్రిలో సేవలందించిన నలుగురు నర్సులకు 'పన్నదాయి అవార్డు'లు, తల్లి పాలపై విశేష అవగాహన కల్పిస్తున్న దుర్గా ప్రసాద్‌కు 'అమృత్ కలశ్ అవార్డు'ను గవర్నర్ అందజేశారు.
తల్లి పాలతో ఎన్నో లాభాలు...
"తల్లి పాలు ఎంతో శ్రేష్ఠమైనవి. ఎన్నో పోషక పదార్థాలు ఉంటాయి. పుట్టిన బిడ్డకు ఆరు నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే తాగించాలి. ఏడో నెల నుంచి తల్లిపాలతో పాటు అనుబంధ పోషకాహారం అందించాలి. తల్లి పాలు పట్టడం ద్వారా అండాశయ, రొమ్ము క్యాన్సర్ వ్యాధి రాకుండా ఉంటుంది. పుట్టిన గంటలోపే బిడ్డకు తల్లి పాలు ఇవ్వాలి. కానీ.. 37 శాతం మాత్రమే అలా జరుగుతుంది. 67 శాతం మాత్రమే 6 నెలల వరకు పిల్లలకు తల్లి పాలు అందుతున్నాయి. ఆ శాతాన్ని పెంచడానికి ధాత్రి మిల్క్ బ్యాంక్స్ కృషి చేయడం అభినందనీయం." - తమిళిసై సౌందరరాజన్, గవర్నర్
ఇవీ చూడండి: