ETV Bharat / city

podu lands issue: నేటి నుంచి పోడు భూముల దరఖాస్తుల స్వీకరణ

author img

By

Published : Nov 8, 2021, 5:13 AM IST

రాష్ట్రంలో పోడు భూముల సమస్య పరిష్కారానికి చెక్​ పెట్టేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణించనుంది. అటవీహక్కుల చట్టం(2005) పరిధిలో అర్హులైన గిరిజనుల నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది

podu lands issue
podu lands issue

రాష్ట్రంలో పోడు భూముల సమస్య పరిష్కారానికి సోమవారం నుంచి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించనుంది. నిర్ణీత షెడ్యూలు ప్రకారం, అటవీహక్కుల చట్టం నాటికి అర్హత కలిగిన గిరిజనుల సమస్యలను వీలైనంత త్వరగా తీర్చేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. దరఖాస్తుల స్వీకరణ నుంచి గ్రామసభలు, సబ్‌డివిజినల్‌, జిల్లా కమిటీల ఆమోదానికి చట్టంలోని విధివిధానాలతో మార్గదర్శకాలు రూపొందించింది. ఈ మేరకు గిరిజన సంక్షేమశాఖ జిల్లా కలెక్టర్లు, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులకు ఆదేశాలు జారీచేసింది.

రాష్ట్రంలో పోడుభూముల సమస్య 2450 గిరిజన గ్రామాల్లో ఉన్నట్లు ప్రభుత్వం అంచనాకు వచ్చింది. అటవీహక్కుల చట్టం(2005) పరిధిలో అర్హులైన గిరిజనుల నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. తొలిరోజు దరఖాస్తుల స్వీకరణతో పాటు గిరిజన గ్రామాలు, గూడేల్లో అటవీ హక్కుల చట్టం, దరఖాస్తు చేసేవిధానం, అర్జీతో సమర్పించాల్సిన పత్రాలపై అవగాహన కల్పించనుంది. ఆవాసాల్లో జనాభా ఎక్కువగా ఉంటే దాన్ని మంగళవారమూ కొనసాగించనుంది. ఈనెల 9, 10 తేదీల్లో దరఖాస్తుల పంపిణీతో పాటు వాటిని పూర్తిచేసేలా అటవీహక్కుల కమిటీలు సహకరిస్తాయి. దరఖాస్తు స్వీకరించేందుకు నాలుగైదు రోజుల సమయం ఇవ్వనుంది. గ్రామస్థాయి కమిటీలు ఈ దరఖాస్తులను పరిశీలించనున్నాయి. ఉపగ్రహ పటాల (శాటిలైట్‌ మ్యాపుల) సాయంతో లబ్ధిదారులు సాగుచేసిన భూముల వివరాలపై దృష్టి పెడతాయి. ఈ ప్రక్రియ పూర్తికావడానికి సుమారు వారం, పది రోజుల సమయం పట్టొచ్చని గిరిజన సంక్షేమశాఖ భావిస్తోంది.

మూడు గ్రామాలకో మీ-సేవ కేంద్రం...

గ్రామకమిటీల ఆధ్వర్యంలో పోడు దరఖాస్తుల పరిశీలన అనంతరం గ్రామసభలు తీర్మానాలు చేస్తాయి. వాటికి సర్పంచి ఛైర్మన్‌గా, పంచాయతీ సెక్రటరీ కార్యదర్శిగా వ్యవహరిస్తారు. క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడైన వివరాలను సభలో ప్రకటిస్తాయి. గ్రామసభ తీర్మానాలు, దరఖాస్తుల్ని గ్రామ కార్యదర్శి మూడు రోజుల్లోగా ఆన్‌లైన్లో అప్‌లోడ్‌ చేయాలి. మూడు గ్రామ పంచాయతీలకు కలిపి ఒక మీ-సేవా కేంద్రాన్ని ఇప్పటికే ప్రభుత్వం గుర్తించింది. పోడుభూముల దరఖాస్తులు తిరస్కరణకు గురైతే దరఖాస్తుదారులు అప్పీలు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించారు. గ్రామసభల్లో తిరస్కరిస్తే సబ్‌డివిజినల్‌ స్థాయిలో అప్పీలు చేసుకోవచ్చు. అక్కడా న్యాయం జరగకుంటే జిల్లా కమిటీలను ఆశ్రయించవచ్చు.

ఇదీచూడండి: Farmers Problems: అన్నదాతల అరిగోసలు.. కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.