ETV Bharat / city

రైతుబీమా నిధులు రూ.800 కోట్లు విడుదల - rythu bandhu funds released

telangana government released Rs 800 crore for rythu bandhu

author img

By

Published : Aug 6, 2021, 2:35 PM IST

Updated : Aug 6, 2021, 3:46 PM IST

14:34 August 06

రైతు బీమాకు నిధులు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోన్న రైతు బీమా పథకానికి నిధులు విడుదలయ్యాయి. నిధుల విడుదలకు పరిపాలనా అనుమతులు మంజూరు కావటంతో.. రూ.800 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.

బాధిత కుటుంబానికి ఆర్థిక చేయూత...

చిన్న, సన్నకారు రైతు ఏ కారణంతోనైనా మరణిస్తే.. ఆ కుటుంబం జీవనోపాధికీ ఇబ్బందే. ఈ దుస్థితిని తప్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబీమా పథకం.. బాధిత కుటుంబాలకు ఆసరాగా నిలుస్తోంది. ఈ పథకం ద్వారా ఆయా రైతుల కుటుంబాలకు ఆర్థికంగా చేయూత అందినట్లు ప్రభుత్వానికిచ్చిన నివేదికలో వ్యవసాయశాఖ వెల్లడించింది.

మరణించిన మూడు రోజుల్లోనే...

ఈ పథకంలో నమోదైన రైతు ఏ కారణంతో కన్నుమూసినా అతని పూర్తి వివరాలను సమీపంలోని వ్యవసాయ విస్తరణ అధికారి(ఏఈఓ) ఎల్‌ఐసీ పోర్టల్‌లో నమోదు చేయాలి. ఈ వివరాలన్నీ అందిన 3 రోజుల్లోనే బాధిత కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం విడుదలవుతోంది. 18 నుంచి 59 ఏళ్ల లోపు రైతులు ఈ పథకానికి అర్హులు కాగా.. ఇందులో నమోదైన రైతు ఏ కారణంతో మరణించినా ఆ కుటుంబానికి రూ.5 లక్షల జీవితబీమా పరిహారం ఎలాంటి వ్యయప్రయాసలు లేకుండా అందుతోంది. గత రెండున్నరేళ్లలో రాష్ట్రంలో ఆ వయసు లోపు రైతులు 43,293 మంది కన్నుమూశారు. అంటే రోజుకు సగటున 57 మంది రైతులు మరణించారు. వీరి కుటుంబాలకు ఇప్పటివరకూ రూ.2,164.65 కోట్లను జీవిత బీమా సంస్థ(ఎల్‌ఐసీ) పరిహారంగా అందజేసింది.  

ఇవీ చూడండి:

Last Updated : Aug 6, 2021, 3:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.