ETV Bharat / city

డిస్కంలకు రూ. 8,925 కోట్లు.. ఉత్తర్వులు విడుదల చేసిన ఇంధనశాఖ - ఉదయ్ పథకం తాజా సమాచారం

Discom losses in telangana: రాష్ట్రంలో విద్యుత్‌ పంపిణీ సంస్థలు భారీగా నష్టాలను చవిచూస్తున్నట్లు సర్కార్‌ తెలిపింది. 2016-20 మధ్య డిస్కంలకు 26 వేల 254 కోట్ల నష్టాలు రాగా... అందులో 8 వేల 925 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని పేర్కొంటూ నిధులు విడుదల చేసింది. ఆ మేరకు రాష్ట్ర ఇంధనశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.

Discom losses in telangana
Discom losses in telangana
author img

By

Published : Jun 19, 2022, 8:17 AM IST

Discom losses in telangana: తెలంగాణలో విద్యుత్తు సరఫరా చేస్తున్న ‘విద్యుత్‌ పంపిణీ సంస్థ’(డిస్కం)లు భారీగా నష్టాలను చవిచూస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. 2016-20 మధ్య కాలంలో ఈ సంస్థలకు వాటిల్లిన నష్టాలు రూ.26,254 కోట్లు అని, అందులో రూ.8,925 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని పేర్కొంటూ నిధులను విడుదల చేసింది. ఆ మేరకు రాష్ట్ర ఇంధనశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న దక్షిణ తెలంగాణ డిస్కంకు రూ.6,228 కోట్లు, వరంగల్‌ కేంద్రంగా ఉన్న ఉత్తర తెలంగాణ డిస్కంకు రూ.2,697 కోట్లు జమచేయాలని ఆదేశాల్లో పేర్కొంది.

ఎందుకీ సాయం...: రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయం, ఇతర వెనకబడిన వర్గాల కోసం అమలుచేసే రాయితీ పథకాలకు, ప్రభుత్వ కార్యాలయాలకు వినియోగించే కరెంటుకు నెలనెలా బిల్లులు చెల్లించకపోవడంతో వాటి బకాయిలు పేరుకుపోతున్నాయి. డిస్కంలు ఏటా నష్టాలను చవిచూస్తున్నాయి. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాలలో ఈ పరిస్థితి ఉంది. వాటిని ఆదుకునే లక్ష్యంతో 2015లో ‘ఉజ్వల్‌ డిస్కం హామీ యోజన’(ఉదయ్‌) పథకాన్ని కేంద్రం అమల్లోకి తెచ్చింది. ఈ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరిస్తే డిస్కంలకు వచ్చే నష్టాల్లో కొంత శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. ఏటా ఆ శాతం పెంచుతూ పోవాలి. ఆ ప్రకారం 2016-17లో డిస్కంలకు వచ్చిన నష్టాల్లో 5 శాతం, 2017-18 తాలూకూ నష్టాల్లో 10 శాతం, 2018-19లో 25 శాతం, 2019-20లో 50 శాతం సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు చెల్లించాల్సి ఉంది. ఆ నిబంధనల ప్రకారం గత నాలుగేళ్ల(2016-20) కాలానికి రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సిన నష్టాల శాతాలను లెక్కగట్టి రూ.8,925 కోట్లు విడుదల చేయాలంటూ ట్రాన్స్‌కో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ మేరకు ఈ నిధులు విడుదల చేస్తున్నట్లు తాజా ఉత్తర్వుల్లో ఇంధనశాఖ తెలిపింది.

మిగిలిన లోటు పూడ్చుకునేదెలా?.. వాస్తవానికి వివిధ వర్గాలకు ఉచితంగా లేదా తక్కువ ఛార్జీలకు కరెంటు ఇస్తున్న పథకాల కింద నెలనెలా రూ.875 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు రాయితీ పద్దు పేరుతో విడుదల చేస్తోంది. అయినా ఇంకా డిస్కంలు నష్టాల్లోనే ఉన్నందున ఉదయ్‌ పథకం కింద ఇప్పుడు మరో రూ.8,925 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. అయినా ఇంకా రూ.17,329 కోట్ల ఆర్థిక లోటులో ఆ సంస్థలు ఉన్నట్టే. ఆ లోటును కొంత పూడ్చుకోవడానికే గత ఏప్రిల్‌ ఒకటి నుంచి కరెంటు ఛార్జీలను పెంచాయి. అయినా ఆర్థిక ఇబ్బందులు తీరలేదు. ఈ కారణంగానే నిధులు సర్దుబాటుకాక ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల్లో ఉద్యోగులకు జీతాలు ఆలస్యంగా చెల్లించాయి. ఈ నేపథ్యంలో మిగిలిన నష్టాలను ఆ సంస్థలు ఎలా పూడ్చుకోబోతున్నాయనేది ప్రశ్నార్థకమైంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.