ETV Bharat / city

సాదాబైనామాల క్రమబద్ధీకరణకు గడువు పెంచిన ప్రభుత్వం

Telangana government has extended the deadline for regularization of plaintiffs
సాదాబైనామాల క్రమబద్ధీకరణకు గడువు పెంచిన ప్రభుత్వం
author img

By

Published : Oct 31, 2020, 5:07 PM IST

Updated : Oct 31, 2020, 5:29 PM IST

17:03 October 31

సాదాబైనామాల క్రమబద్ధీకరణకు గడువు పెంచిన ప్రభుత్వం

మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో విలీనమైన గ్రామాల్లోనూ సాదాబైనామాల ద్వారా జరిగిన వ్యవసాయ భూములను ఉచితంగా క్రమబద్ధీకరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్​ నిర్ణయించారు. జనగామ జిల్లా కొడకండ్లలో రైతువేదిక ప్రారంభించిన తర్వాత... ఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు.  

వరంగల్ కార్పొరేషన్​లో విలీనమైన గ్రామాల్లో కూడా సాదాబైనామాలను క్రమబద్ధీకరించాలని ముఖ్యమంత్రిని కోరారు. సానుకూలంగా స్పందించిన సీఎం... ఈ నిర్ణయం తీసుకున్నారు. దరఖాస్తు చేసుకునేందుకు వారం రోజుల పాటు గడువు ఇస్తూ... వెంటనే సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్​ను ఆదేశించారు.

ఇదీ చూడండి: అబద్ధమని నిరూపిస్తే రాజీనామా చేస్తా: కేసీఆర్

Last Updated : Oct 31, 2020, 5:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.