ఇటీవల మహిళా దినోత్సవం సందర్భంగా షీటీం, హైదరాబాద్ నగర పోలీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉద్యోగ మేళాకు దాదాపు 9 వేల మంది అభ్యర్థినులు హాజరయ్యారు. ఉద్యోగాలు చేయాలనే వారి ఆసక్తిని ఈ సంఖ్య ప్రతిబింబించింది. ఉన్నత విద్యతో వారిలో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, ఆర్థిక స్వేచ్ఛ పెరుగుతున్నాయి. పురుషులతో సమానంగా అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు.
అధిక ప్రవేశాలకు కారణాలు..
- సమాజం ఆలోచన విధానంలో వస్తున్న మార్పులు. ఇరువురినీ ఒకేలా చూసే ధోరణి తల్లిదండ్రుల్లో పెరగడం.
- మారుతున్న కాలానికనుగుణంగా ఇంట్లో ఇద్దరు ఉద్యోగం చేయాలనే వాతావరణం పెరుగుతుండటం.
- మహిళలు సమానత్వం, ఆర్థిక స్వేచ్ఛ కోరుకోవడం.
- ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో స్త్రీలకు ప్రాధాన్యం ఇవ్వడం, గురుకులాల్లోని ఉద్యోగాలు మహిళలకే కేటాయించడం.
- మొత్తం సీట్లలో 33 శాతం రిజర్వేషన్, ఓపెన్ కేటగిరిల్లోనూ ప్రతిభ చాటడం.
- గ్రామీణులు అమ్మాయిల ఉన్నత చదువుకు ప్రోత్సాహం అందిస్తుండటం.
- ప్రభుత్వ పథకాలు, ప్రత్యేక విద్యాసంస్థల ఏర్పాటు
- అబ్బాయిలు ఉద్యోగానికి ప్రాధాన్యం ఇస్తుంటే అమ్మాయిలు ఉన్నత విద్య వైపు ఆసక్తి చూపడం.
నాణేనికి రెండో వైపు..
‘‘ఇప్పటికీ మన సమాజం పురుషాధిపత్యంలోనే ఉంది. అబ్బాయిల చదువుకు ఎంత ఖర్చు చేసైనా.. జాతీయ, అంతర్జాతీయ విద్యాసంస్థల్లో చేర్పిస్తున్నారు. అమ్మాయిలను స్థానికంగానే చదివిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్నత విద్యలో వారి ప్రాతినిధ్యం పెరగడానికి ఇదీ ఓ కారణమ’’ని ఓయూ సోషియాలజీ విభాగం అధ్యాపకుడు డా.రామ్ షెఫర్డ్ వివరించారు.
మహిళ విద్యతోనే అభివృద్ధి..
మహిళా విద్యను ప్రోత్సహించే సమాజం త్వరగా అభివృద్ధి చెందుతుంది. ఒక మహిళ చదువుకుంటే కుటుంబంలోని తర్వాతి తరాలకూ అవకాశం లభిస్తుంది. ఆమెకు ఆర్థిక స్వాతంత్య్రం లభిస్తుంది. ఎలాంటి పరిస్థితులనైనా ధైర్యంగా ఎదుర్కొనే శక్తి లభిస్తుంది.
- ప్రొ.కిషన్, పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్షల కన్వీనర్
- ఇదీ చూడండి : డిజైన్లో డిగ్రీ.. పీజీ..! దరఖాస్తులకు ఐఐఏడీ ఆహ్వానం