మాజీ మంత్రి ఈటల రాజేందర్ భాజపాలో చేరుతున్నట్లు జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసిన తరువాత ఈటల రాజేందర్ తన భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు అన్ని పార్టీల నేతలను స్వయంగా వెళ్లి కలిశారు.
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని కలిసినప్పుడు ఆయన.. ఈటలను పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఈటల రాజేందర్ భాజపాలో చేరే విషయంలో తర్జనభర్జన పడుతున్నట్లు సమాచారం.
గత కొద్ది రోజుల నుంచి తెరాస నుంచి బయటకు వచ్చిన వారు, అసంతృప్తితో ఉన్న వారితో పాటు.. వివిధ పార్టీల నేతలను ఈటల కలిశారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, తన రాజకీయ భవిష్యత్తుపై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.