Telangana film chamber : సినిమా థియేటర్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలపై తెలంగాణ చలనచిత్ర వాణిజ్య మండలి హర్షం వ్యక్తం చేసింది. సర్కార్ నిర్ణయంతో రాష్ట్రంలో 80 శాతానికిపైగా ఆక్యుపెన్సీతో థియేటర్లు నడుస్తున్నాయని పేర్కొంది. రాష్ట్రంలో సినీ పరిశ్రమ, థియేటర్లకు సంబంధించి దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను ముఖ్యమంత్రి పరిష్కరించడం పట్ల ధన్యవాదాలు తెలిపింది.
తెలంగాణ ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు సునీల్ నారంగ్ ఆధ్వర్యంలో అనుపమ్‌రెడ్డి, బాలగోవిందరాజు, చంద్రశేఖర్, సదానంద్ గౌడ్.. బీఆర్కే భవన్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో థియేటర్ల నిర్వహణ, కొత్త సినిమాల విడుదల, ప్రేక్షకుల రద్దీపై అరగంటపాటు చర్చించారు. కొవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ థియేటర్ల నిర్వహణ జరుగుతుందని ఫిల్మ్ చాంబర్ ప్రతినిధులు సీఎస్‌కు వివరించారు.
ఇదీచూడండి: closure of theatres in ap: స్వచ్ఛందమేం కాదు.. తనిఖీల వల్లే థియేటర్లు మూసేశారు: ఏపీ మంత్రి