ETV Bharat / city

గతేడు తెగిన చెరువు కట్టలు.. ఇప్పటికీ పట్టించుకోని అధికారులు - telangana farmers are tensed

వర్షాలు కురుస్తుంటే సంబురపడాల్సిన రైతులు.. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని భయపడుతున్నారు. చాలా ప్రాంతాల్లో చెరువు కట్టలు తెగిపోవడం వల్ల తమ పంటంతా మునిగిపోతుందని ఆందోళన చెందుతున్నారు. గతేడాది వర్షాలకు తెగిన కట్టలకు ఇప్పటికీ మరమ్మతులు చేపట్టకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.

గతేడు తెగిన చెరువు కట్టలు
గతేడు తెగిన చెరువు కట్టలు
author img

By

Published : Jul 23, 2021, 7:17 AM IST

కరిమబ్బులు కమ్ముకొస్తుంటే సంబరపడాల్సిన రైతులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో గతేడాది వర్షాలకు తెగిన చెరువుల మరమ్మతులు నేటికీ చేపట్టకపోవడంతో సాగు ఎలా అని కలవరపడుతున్నారు. తాజాగా కురుస్తున్న భారీ వర్షాలకూ పలు చెరువుల కట్టలు కొట్టుకుపోతున్నాయి. తక్షణమే వాటి నిర్వహణ చేపట్టాల్సి ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో స్పందన కనిపించడం లేదు.

రాష్ట్రంలో గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు వేలాది చెరువులకు నష్టం వాటిల్లింది. వాటిలో కట్టలు తెగిపోయినవి 419... బుంగలు, మత్తడి రాళ్లు కొట్టుకుపోయినవి మరో 419 ఉన్నాయి. ఇవికాక తూము తలుపులు విరిగిపోవడం, కాల్వకు గండ్లు, కట్టకు పగుళ్లు రావడంవంటి సమస్యలున్నవి అనేకం ఉన్నాయి. చాలా జిల్లాల్లో ఇలాంటి చెరువుల మరమ్మతు పనులు ఇప్పటికీ చేపట్టకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే జోరు వర్షాలు కురుస్తుండగా తటాకాల్లోకి వరద రావడం ప్రారంభమవుతోంది. దీంతో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమస్యలపై ఏడాది కాలంగా స్పందించని అధికారుల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపాదనలు సిద్ధంచేసి ఇప్పటికిప్పుడు మరమ్మతు చేసినా కురుస్తున్న వర్షాలకు పనులు పటిష్టంగా ఉండే అవకాశాలు లేవని చెబుతున్నారు.

మరమ్మతుల పనులు అంతంతమాత్రమే

  • ప్రభుత్వం చెరువుల పునరుద్ధరణకు మిషన్‌ కాకతీయ కింద పెద్దఎత్తున నిధులు మంజూరు చేసింది. నాలుగు విడతల్లో చెరువు కట్టల బలోపేతం, తూము, అలుగు, పాటు కాల్వల మరమ్మతు, పొదల తొలగింపు, పూడికతీత పనులకు వీటిని విడుదల చేశారు. క్షేత్రస్థాయిలో మాత్రం చాలా ప్రాంతాల్లో పనులు అస్తవ్యస్తంగా పూర్తి చేశారు. ఫలితంగా పలు చోట్ల నిర్మాణాలకు పగుళ్లు రావడం, కట్టలు కొట్టుకుపోతున్న సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
  • మూడేళ్ల క్రితం మరమ్మతులు చేసిన వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలం కేంద్రంలోని పెద్ద చెరువు కట్ట అలుగు ప్రాంతంలో గతేడాది వర్షాలకు కొట్టుకుపోయింది. కోతకు గురైన చోట తాత్కాలికంగా మట్టి పోశారు. కల్వకుర్తి ఎత్తిపోతల నీళ్లను తూము మట్టం వరకు నిల్వ చేసి వదులుతున్నారు. భారీ వరద వస్తే 300 ఎకరాల ఆయకట్టుకు నష్టమని రైతులు చెబుతున్నారు.
  • మహబూబాబాద్‌ జిల్లా వర్ధన్నపేట కోనారెడ్డి చెరువు గతేడాది కొట్టుకుపోయి 800 ఎకరాల పంటలు దెబ్బతిన్నాయి. దీని కింద రెండు వేల ఎకరాల ఆయకట్టు ఉండగా తాత్కాలికంగా రింగ్‌బండ్‌ వేసి మమ అనిపించారు. దీంతో 20 అడుగుల మట్టం కాస్త 12 అడుగులకు పడిపోయింది. పంట నష్టపోయిన వారికి ఇప్పటికీ పరిహారం అందలేదు.
  • గార్ల మండలంలోని గండిచెరువు తూము తలుపుపైభాగం 4 నెలల క్రితం శిథిలమైంది. కాంక్రీటు బెడ్‌ వేయాల్సి ఉన్నప్పటికీ పనులు ప్రారంభం కాలేదు.
  • పాకాల కొత్తగూడ మండలం కిష్టాపురంలోని నల్లంకుంట తూము శిథిలమై.. కుంటలోకి వచ్చిన నీళ్లు వచ్చినట్లే దిగువకు పోతున్నాయి. కట్ట కూడా గతేడాది తెగిపోగా రైతులే మరమ్మతు చేసుకున్నారు. కట్టను ఇంకా పటిష్టం చేయాలని కోరుతున్నారు.
పెద్ద రాయినేని చెరువు అలుగు

ది నాగర్‌కర్నూలు జిల్లా లింగాల మండల కేంద్రంలోని పెద్ద రాయినేని చెరువు అలుగు. గతేడాది వర్షాలకు కొట్టుకుపోయింది. ఇప్పటికీ మరమ్మతులు చేయలేదు. కుడి, ఎడమ కాల్వలు కూడా సరిగాలేవు. మిషన్‌ కాకతీయ పథకంలో రూ.8 లక్షలతో రెండేళ్ల క్రితం ఈ చెరువుని పునరుద్ధరించినా ప్రయోజనం లేకపోయింది. ఈ ఏడాది ప్రవాహం వచ్చి చేరితే పరిస్థితి ఏంటని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇదే మండలం రాయవరం సమీపంలో వాగుపై ఉన్న చెక్‌డ్యాం నుంచి రెండు కిలోమీటర్ల్ల పొడవున పెద్దకుంట వరకు ఉన్న పాటు కాల్వ మరమ్మతు చేశారు. ఈ పనులకు రూ.19 లక్షలు గుత్తేదారుకు మంజూరయ్యాయి. కాల్వ, కుంట పనులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. రాంపురం దౌతికుంట కూడా గతేడాది తెగిపోగా ఇప్పటికీ మరమ్మతులు చేయలేదు.

తెగిన చెరువులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.