ETV Bharat / city

'డిసెంబర్​ 25కు సీఎం కేసీఆర్​ పీఆర్సీ ప్రకటించే అవకాశముంది' - telangana employees union latest news

హైదరాబాద్‌ లక్డీకాపూల్‌లోని వెంకటేశ్వర హోటల్‌లో తెలంగాణ ఉద్యోగుల కేంద్ర సంఘం సమావేశమైంది. తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా పవన్‌ కుమార్‌ గౌడ్‌ను కేంద్ర సంఘం ఏకగ్రీవంగా ఎన్నుకుంది. అధ్యక్షునిగా ఉన్న పద్మాచారిని గౌరవ ఛైర్మన్‌గా ప్రకటించింది.

'డిసెంబర్​ 25కు సీఎం కేసీఆర్​ పీఆర్సీ ప్రకటించే అవకాశముంది'

author img

By

Published : Dec 12, 2020, 8:34 PM IST

డిసెంబర్‌ 25కు ముఖ్యమంత్రి కేసీఆర్‌.... పీఆర్సీ ప్రకటించే అవకాశం ఉందని తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పపన్​కుమార్​ గౌడ్​ ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా పవన్‌ కుమార్‌ గౌడ్‌ను కేంద్ర సంఘం ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ప్రస్తుతం అధ్యక్షునిగా ఉన్న పద్మాచారిని గౌరవ ఛైర్మన్‌గా ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్‌ లక్డీకాపూల్‌లోని వెంకటేశ్వర హోటల్‌లో తెలంగాణ ఉద్యోగుల కేంద్ర సంఘం సమావేశమైంది. అనంతరం ఉద్యోగుల సంఘం నేతలు కొత్తగా ఎన్నుకున్న రాష్ట్ర అధ్యక్షుడు, గౌరవ ఛైర్మన్‌ను ఘనంగా సత్కరించారు.

ఉద్యోగుల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తానని నూతనంగా ఎంపీకైన అధ్యక్షుడు పవన్‌కుమార్‌ గౌడ్‌ తెలిపారు. ఉద్యోగులకు రావాల్సిన పీఆర్సీ, డీఏ బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని పవన్​కుమార్​ డిమాండ్‌ చేశారు. హెల్త్‌కార్డులు, పీఆర్సీ, డీఏ అమలు విషయంలో త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​కుమార్‌ను కలిసి చర్చించనున్నట్లు ఆయన తెలిపారు.

ఇదీ చూడండి: ఈ నెలలోనే రైతులందరికీ రైతుబంధు: మంత్రి నిరంజన్​రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.