Telangana Employees Transfer : ఉద్యోగుల బదలాయింపులో భాగంగా హైదరాబాద్‌లో జిల్లా స్థాయిలోని ఉద్యోగులను మినహాయించారు. జోనల్, బహుళజోన్ల పరిధిలో మాత్రమే హైదరాబాద్‌ను పరిగణనలోకి తీసుకొని కేటాయింపులు చేపట్టారు. ఈ మేరకు చాలా శాఖల జోనల్, బహుళజోనల్ ఉద్యోగులు, అధికారులు రెండువేల మందికి పైగా హైదరాబాద్‌లో నియమితులయ్యారు. శాఖాధిపతుల, జోనల్ కార్యాలయాల్లో వారికి పోస్టింగులు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం బదలాయింపుల అనంతరం అభ్యంతరాలు ఉంటే అప్పీలు చేసుకునే అవకాశం ఉద్యోగులకు కల్పించింది. ఈ మేరకు ఇతర జిల్లాలకు బదలాయించిన వారిలో మూడు వేల మంది వరకు హైదరాబాద్ జోన్ కావాలని అప్పీలు చేసుకున్నారు. దీనికి భిన్నంగా 230 మంది మాత్రం తమకు హైదరాబాద్ వద్దని దూర జిల్లాలు కావాలని కోరారు.
సర్దుబాటుకు పరస్పరం ఆరా
Telangana Employees Transfer Updates : సాధారణంగా సాంకేతిక అంశాల ప్రాతిపదికన మాత్రమే ప్రభుత్వం అభ్యంతరాలను పరిశీలనలోకి తీసుకునే వీలుంది. హైదరాబాద్ వద్దు జిల్లాలకు వెళ్తామనే అంశం నిబంధనలకు అనుగుణంగా లేనందున వాటిపై ఏం చేయాలా అని ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. ఈ సమయంలో సర్కారు పరస్పర బదిలీలపై సానుకూలత వ్యక్తం చేసింది. దీంతో ఈ ఉద్యోగుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. వీరు జిల్లాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే వారి గురించి అన్వేషణ చేపట్టారు. మరోవైపు వీరి గురించి తెలుసుకొని జిల్లా కార్యాలయాల్లో ఉన్న వారూ సంప్రదిస్తున్నారు.
ఇదీ చదవండి : Employees Postings: నేడు జోనల్, బహుళ జోనల్ అధికారుల బదిలీలు..
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!