వివిధ శాఖల్లో అభివృద్ధి పనులకు కేటాయించిన నిధులతో ఉపాధి హామీ పథకం పనులను అనుసంధానించేందుకు కార్యాచరణ రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఉపాధిహామీ పనుల అనుసంధానంపై ఉన్నతాధికారులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు.
గ్రామీణ ప్రాంతాలు అధిక నిధులు పొందేలా పెద్ద ఎత్తున ఉపాధి హామీ పనులు చేపట్టాలని సూచించారు. తద్వార యువతకు ఉపాధి లభించేలా చూడాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారన్నారు. ఆయా శాఖల్లో చేపట్టే పనుల గుర్తింపు సహా ఉపాధి హామీ ద్వారా పనులు చేసేందుకు వీలుగా సీజనల్ క్యాలెండర్‌ను రూపొందించాలని సీఎస్ ఆదేశించారు.
ప్రాధాన్య కార్యక్రమాలపై దృష్టి..
ఉపాధి హామీ, వివిధ శాఖలకు కేటాయించిన నిధులతో ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలైన వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, రైతు వేదికలు, పార్క్‌లు, గొర్రెలు, పశువుల షెడ్ల నిర్మాణాలు చేపట్టాలన్నారు. ఫీడర్ ఛానళ్లు, కాలనీల్లో మౌలిక వసతుల కల్పనపై దృష్టిసారించాలని అధికారులకు సూచించారు.
ఉపాధి హామీ పనులలో వివిధ శాఖలు క్రియాశీలకంగా వ్యవహరించాలని సోమేశ్‌కుమార్ సూచించారు. పనులకు సంబంధించి నిర్ణీత నమూనాలను రూపొందించాలన్నారు. ఉపాధి హామీ పనులకు సంబంధించి గ్రామ, మండల, జిల్లాల వారీగా ప్రణాళికలు తయారుచేయాలని అధికారులను సీఎస్ ఆదేశించారు.
ఇవీచూడండి: కేటీఆర్‌కు పదిసార్లు ఫోన్ చేసినా ఫలితం లేదు: రాజాసింగ్