సరళతర వాణిజ్యవిధానం అమలుపై ఆయా శాఖల్లో అంతర్గత విశ్లేషణ చేసేందుకు ఉపకమిటీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. దీనిపై వాణిజ్యపన్నులు, ఎక్సైజ్, పౌరసరఫరాలు, రవాణా, ఇంధన, హోం, పురపాలక, కార్మిక శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులతో సీఎస్ సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.
ఆయా శాఖల్లోని రిజిస్ట్రేషన్లు, లైసెన్సులు, అనుమతుల జారీ, తనిఖీలు, రికార్డుల నిర్వహణ తదితర అంశాలపై సమీక్షించారు. శాఖల వారీగా అంతర్గతంగా విశ్లేషించి ఉపకమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు.
సరళతర వాణిజ్య నిబంధనల తయారీలో ప్రభుత్వం... ప్రస్తుతం అమలుచేస్తున్న పారిశ్రామిక, వర్తక ప్రోత్సాహక నిబంధనలు, చట్టాలను పరిశీలించాలని సూచించారు. ప్రక్రియను సులభతరం చేసేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్రం కోరిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులకు తెలిపారు.
ఇవీచూడండి:'పురపాలికల్లో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక ప్రణాళికలు'