ETV Bharat / city

హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టుపై తెలంగాణ ఫిర్యాదు

Handri Neeva Sujala Sravanthi project
Handri Neeva Sujala Sravanthi project
author img

By

Published : Nov 15, 2021, 4:58 PM IST

Updated : Nov 15, 2021, 6:50 PM IST

16:56 November 15

హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టుపై తెలంగాణ ఫిర్యాదు

కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ మరో లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. అనుమతి లేకుండా హంద్రీనీవా సుజల స్రవంతి(Handri neeva sujala sravanthi project) ప్రాజెక్టు విస్తరణ పనులు చేపడుతోందని లేఖలో పేర్కొన్నారు. అనుమతుల్లేకుండా విస్తరణ పనుల కోసం టెండర్లు పిలిచిందని.. విస్తరణ పనులను వెంటనే నిలిపివేసేందుకు చర్యలు తీసుకోవాలని కేఆర్ఎంబీ(Krishna River management board)కి ఈఎన్సీ మురళీధర్ విజ్ఞప్తి చేశారు. 

ఏపీ ప్రభుత్వం 34 టీఎంసీల పై చిలుకు నీటిని శ్రీశైలం రిజర్వాయర్ నుంచి వాడుకుంటోందని మురళీధర్​ లేఖలో తెలియజేశారు. మిగులు నీటి ఆధార ప్రాజెక్టులు, అనుమతి లేని ప్రాజెక్టులకు సంబంధించి 3,850 క్యూసెక్కుల బదులు 6,300ల క్యూసెక్కుల వినియోగంపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేఆర్ఎంబీకి పలు దఫాలుగా ఫిర్యాదులు చేసిందని వివరించారు. హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు అంశాన్ని లేఖలో పేర్కొన్నారు. 

వేల కిలోమీటర్లు తరలించడం అన్యాయం

కృష్ణా జలవివాదాల రెండో ట్రైబ్యునల్ నీటివాటాలను తేల్చే వరకు ఈ ప్రాజెక్టు(Handri neeva sujala sravanthi project)  నుంచి ఏపీ ప్రభుత్వం నీరు తీసుకోకుండా నిలువరించాలని గతంలో తెలంగాణ.. కేఆర్​ఎంబీని కోరింది. ఈ మేరకు కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్​కు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ ఆగస్టులో లేఖ రాశారు. బచావత్ ట్రైబ్యునల్ ప్రకారం శ్రీశైలం జలాశయం జలవిద్యుత్​కు ఉద్దేశించినదేనని.. అక్కడి నుంచి కృష్ణా బేసిన్ వెలుపలకు నీటి తరలింపునకు ట్రైబ్యునల్ అనుమతించలేదని పేర్కొన్నారు. వరదజలాలపై ఆధారపడి నిర్మించిన హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు(Handri neeva sujala sravanthi project)  ద్వారా ఏపీ ప్రభుత్వం.. కృష్ణా బేసిన్ వెలుపలకు నీటిని తరలిస్తోందని అన్నారు. దీంతో బేసిన్​లోని తెలంగాణ ప్రాజెక్టులు నష్టపోతాయని.. నది ఒడ్డునున్న తెలంగాణ ప్రాంతాలను కాదని బేసిన్ వెలుపల 700 కిలోమీటర్ల దూరానికి నీటిని తరలించడం అన్యాయమని లేఖలో పేర్కొన్నారు.  

హంద్రీనీవా సుజల స్రవంతి(Handri neeva sujala sravanthi project)  నుంచి తుంగభద్ర హైలెవల్ కెనాల్ తదితర ప్రాజెక్టులకు బేసిన్ వెలుపలకు నీటిని తరలిస్తున్నందున బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ కేటాయింపులు కూడా చేయలేదని ఈఎన్సీ గుర్తు చేశారు. అలా నీటిని తరలించడం ట్రైబ్యునల్ తీర్పునకు వ్యతిరేకమని అన్నారు. మిగులు జలాలపై ఆధారపడి బేసిన్ వెలుపలకు నీటిని తీసుకెళ్లే హంద్రీనీవా ప్రాజెక్టునే తాము వ్యతిరేకిస్తుంటే సామర్థ్యాన్ని 3,850 నుంచి 6,300 క్యూసెక్కులకు పెంచడం అక్రమమని తెలంగాణ ఈఎన్సీ లేఖలో పేర్కొన్నారు. వరదజలాలపై ఆధారపడి చేపట్టిన ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేయాలని తెలంగాణ కోరుతోందని.. ఆంధ్రప్రదేశ్ మాత్రం విజ్ఞప్తి చేయడం లేదని అన్నారు. వీటన్నింటి నేపథ్యంలో బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ వాటాలు ఖరారు చేసే వరకు హంద్రీనీవా(Handri neeva sujala sravanthi project)  నుంచి నీటిని తరలించకుండా ఆంధ్రప్రదేశ్​ను నిలువరించాలని ఆగస్టులో రాసిన లేఖలో కోరారు. 

ఇదీ చదవండి: Bandi Sanjay tour: బండి పర్యటనలో ఉద్రిక్తత.. అడుగడుగునా తెరాస శ్రేణుల అడ్డగింత

Last Updated : Nov 15, 2021, 6:50 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.