ETV Bharat / city

CM KCR District Tour: ఈనెల 11న జనగామ జిల్లాకు సీఎం కేసీఆర్​ - kcr news

CM KCR District Tour: ముఖ్యమంత్రి కేసీఆర్​ వరుస ప్రారంభోత్సవాలకు సిద్ధమవుతున్నారు. కలెక్టరేట్లతో పాటు తెరాస జిల్లా కార్యాలయాలను ప్రారంభించనున్నారు. హైదరాబాద్‌లో అత్యాధునికంగా నిర్మించిన పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ఈ నెల 15న సీఎం ప్రారంభించే అవకాశం ఉంది.

cm kcr district tour
cm kcr
author img

By

Published : Feb 6, 2022, 5:24 AM IST

CM KCR District Tour: సమీకృత కలెక్టరేట్ సముదాయాలు పూర్తయిన చోట ప్రారంభోత్సవాలకు ముఖ్యమంత్రి కేసీఆర్​ సిద్ధమవుతున్నారు. డిసెంబర్ నెలలోనే జిల్లాల కలెక్టరేట్ భవనాలను ప్రారంభించాలని సీఎం నిర్ణయించారు. అయితే ధాన్యం కొనుగోళ్ల అంశం కారణంగా అప్పుడు జరగలేదు. ఆ కార్యాలయాలను ఇప్పుడు ప్రారంభించాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు తెలిసింది.

వీలును బట్టి ఇతర జిల్లాల్లోనూ..

ఈనెల 11న జనగామతో కేసీఆర్​ పర్యటన ప్రారంభం కానుంది. జనగామ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం, తెరాస కార్యాలయ ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఆ రోజు బహిరంగ సభలోనూ ప్రసంగించనున్నారు. ఆ తరువాత వీలును బట్టి ఇతర జిల్లాల్లోనూ ప్రారంభోత్సవాలు ఉండే అవకాశం ఉంది. యాదాద్రి భువనగిరి, వనపర్తి, నిజామాబాద్, జగిత్యాల, వికారాబాద్‌లో సమీకృత కలెక్టరేట్లు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. పలు జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు కూడా సిద్ధమయ్యాయి.

15న కమాండ్​ కంట్రోల్​ సెంటర్​..

అటు హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వం అత్యాధునికంగా నిర్మించిన కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్​ త్వరలో ప్రారంభించనున్నారు. పనులన్నీ పూర్తయిన నేపథ్యంలో ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 15న కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను కేసీఆర్​ ప్రారంభిస్తారని అంటున్నారు. మేడారం జాతర సందర్భంగా ఇక్కణ్ణుంచే పర్యవేక్షించే వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెబుతున్నారు.

ఇదీచూడండి: సీఎంకు ఆ పోస్టులు చూపించిన పోలీసులు! ఇక వాళ్లకి దబిడ దిబిడేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.