జైన తీర్థంకరుల పాదముద్రలతో తెలంగాణ నేల పావనమైందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మహావీర్ జయంతి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ జైన, బౌద్ధ ఆరామాలకు నెలవుగా ఉందన్న ఆయన.. మహావీరుని జీవిత సందేశం మనందరికీ ఆదర్శమన్నారు.
కరోనా సమయం మానవ జాతికి ఒక పరీక్షా సమయమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మహావీరుని బోధనల స్ఫూర్తితో సహనంతో వ్యవహరించాలని సూచించారు. స్వీయ కట్టుబాట్లు, నిబంధనలను అనుసరిస్తూ కరోనాను జయిద్దామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
ఇవీచూడండి: తెలంగాణలో తొలిసారి 8వేలు దాటిన కరోనా కేసులు