ETV Bharat / city

రాష్ట్ర కేబినెట్​ భేటీ.. లాక్‌డౌన్‌తో పాటు కీలక అంశాలపై చర్చ - telangana news

telangana cabinet
రాష్ట్ర కేబినెట్​ భేటీ
author img

By

Published : May 30, 2021, 2:04 PM IST

Updated : May 30, 2021, 4:55 PM IST

14:02 May 30

రాష్ట్ర కేబినెట్​ భేటీ.. లాక్‌డౌన్‌తో పాటు కీలక అంశాలపై చర్చ

ప్రగతిభవన్‌లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. లాక్‌డౌన్ అంశంతో పాటు కరోనా కట్టడి చర్యలపై కేబినెట్​ చర్చిస్తోంది. రాష్ట్రంలో విధించిన లాక్​డౌన్​ నేటితో ముగియనున్న దృష్ట్యా.. వారం, పది రోజులు లాక్‌డౌన్ పొడిగించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న సడలింపు సమయాన్ని పెంచే సూచనలు కనిపిస్తున్నాయి. అంటే ఉదయం 6-12 గంటల వరకు పెంచే అవకాశం ఉంది. వ్యాక్సినేషన్, వైద్యారోగ్యశాఖ, పోలీస్‌ శాఖలకు అదనంగా నిధులు కేటాయించే అవకాశముంది.  

కరోనా చికిత్స, ఔషధాలు, ఆక్సిజన్ సదుపాయాలపైనా మంత్రివర్గంలో చర్చ జరగనుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, వివిధ పథకాలు, కార్యక్రమాలపై చర్చించనున్నారు. వానాకాలం పంటల సాగు, ధాన్యం కొనుగోళ్లు సహా నీటిపారుదలశాఖలో నియామకాల కోసం బోర్డు ఏర్పాటుపై చర్చించనున్నారు. ఎస్‌ఆర్‌ఎస్పీ పునరుజ్జీవ పథకం అంచనాల పెంపుపైనా సమాలోచనలు చేయనున్నారు. 

Last Updated : May 30, 2021, 4:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.