ETV Bharat / city

లాక్​డౌన్​పై రేపు సీఎం కీలక నిర్ణయం

telangana Cabinet meeting tomorrow afternoon
రేపు మధ్యాహ్నం మంత్రివర్గం సమావేశం
author img

By

Published : May 10, 2021, 7:08 PM IST

Updated : May 10, 2021, 8:01 PM IST

19:06 May 10

లాక్​డౌన్​పై రేపు సీఎం కీలక నిర్ణయం

రోజురోజుకు కరోనా ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోనుందా..? ప్రస్తుతం అమలవుతున్న రాత్రి కర్ఫ్యూని లాక్‌డౌన్‌గా మార్చనుందా? లేకుంటే లాక్‌డౌన్‌ తరహా ఆంక్షలతో ఉదయం కూడా కర్ఫ్యూని అమలు చేస్తారా? ఈ ప్రశ్నలన్నింటికీ రేపు తెరపడే అవకాశం ఉంది.  

సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంగళవారం మధ్యాహ్నం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి దృష్ట్యా లాక్‌డౌన్‌పై సమావేశంలో చర్చించనున్నారు. కొన్ని రాష్ట్రాల్లో లాక్​డౌన్​ విధించినా.. కరోనా వ్యాప్తి తగ్గడం లేదని, సరైన ఫలితాలు లేవని నివేదికలు అందుతున్నాయని ప్రభుత్వం చెబుతోంది. ఈ నేపథ్యంలో లాక్​డౌన్​ విధింపుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కొన్ని వర్గాలు లాక్​డౌన్​ కావాలని కోరుతున్నాయని ప్రభుత్వం పేర్కొంది. 

ఈ పరిస్థితుల్లో లాక్​డౌన్​ విధిస్తే వచ్చే సాదకబాధకాలపై కేబినెట్​ సమావేశంలో చర్చించనున్నారు. ఒకవేళ లాక్​డౌన్​ విధిస్తే ధాన్యం కొనుగోళ్లపై పడే ప్రభావంపైనా చర్చిస్తారు. అన్ని అంశాలపై చర్చించి లాక్‌డౌన్‌పై కేబినెట్​ కీలక నిర్ణయం తీసుకోనుంది.

ఇవీచూడండి: కరోనా కట్టడికి రాష్ట్రాల 'లాక్​డౌన్' అస్త్రం

Last Updated : May 10, 2021, 8:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.