ETV Bharat / city

మంత్రివర్గ విస్తరణ ఉంటుందా? ఉండదా?

రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ కోసం ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సుమారు ఆరు నెలలుగా ఎదురు చూస్తున్నారు. ఆరు పదవులే ఖాళీ ఉండగా... చాలా మంది నేతలు ఆశలు పెట్టున్నారు. దసరా తర్వాతే విస్తరణ ఉండొచ్చునని తెరాస శ్రేణులు భావిస్తున్నాయి. ప్రస్తుత మంత్రుల్లోనూ మార్పులు ఉండొచ్చునన్న ఊహాగానాలు ఉన్నాయి. పార్లమెంటు, పంచాయతీ, ప్రాదేశిక, మున్సిపాల్టీ ఎన్నికల్లో నేతల పనితీరే పదవులకు ప్రధాన ప్రామాణికంగా తీసుకుంటామని తెరాస అధిష్ఠానం సంకేతాలు ఇస్తోంది.

author img

By

Published : Jul 23, 2019, 5:19 PM IST

Updated : Jul 23, 2019, 7:57 PM IST

kcr
మంత్రివర్గ విస్తరణ ఉంటుందా? ఉండదా?

రాష్ట్ర మంత్రివర్గంలో బెర్తుల కోసం పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నెలల తరబడి ఎదురు చూస్తున్నారు. కేబినెట్ విస్తరణ ఎప్పుడు ఉంటుందోనని నిరీక్షిస్తున్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రితో కలిపి 18 మంది మంత్రివర్గంలో ఉండాలి. ఇప్పటికే 12 మంది ఉన్నందున.. మరో ఆరుగురికే అవకాశం ఉంటుంది. కేబినెట్​లో ఇద్దరు మహిళలకు స్థానం కల్పిస్తామని అసెంబ్లీలో కేసీఆర్ ప్రకటించారు. మహిళల కోటాలో ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, పద్మా దేవేందర్ రెడ్డి, రేఖా నాయక్, గొంగిడి సునీత, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ ఆశలు పెట్టుకున్నారు. సబిత ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్​కు పార్టీ కీలక నేతలు హామీ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది.

కేబినెట్​లోకి కవిత లేదా వినోద్!

మాజీ ఎంపీలు కవిత లేదా వినోద్ కుమార్​లలో ఒకరికి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారని కొన్ని రోజులుగా ఊహాగానాలు నెలకొన్నాయి. కేబినెట్ విస్తరణలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చోటు కల్పిస్తామని కేసీఆర్ గతంలోనే స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లాతో పాటు ఎస్సీ మాదిగ కోటాలో తెరాసకు మద్దతు ప్రకటించిన సండ్ర వెంకటవీరయ్యకు అవకాశం ఉండొచ్చునని చెబుతున్నారు. మంత్రివర్గంలో చోటు కోసం ఆశలు పెట్టుకున్న గుత్తా సుఖేందర్ రెడ్డి.. నల్గొండ ఎంపీగా టికెట్ ఇచ్చేందుకు తెరాస నాయకత్వం సిద్ధపడినప్పటికీ ఆయన వదులుకున్నారు. శాసనమండలిలో ఏర్పడిన మూడు ఖాళీల్లో ఒకటి గుత్తా సుఖేందర్ రెడ్డికి ఖాయమైనట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.

హరీశ్​, కేటీఆర్​కు స్థానంపై ఊహాగానాలు

రాష్ట్ర మంత్రివర్గంలో మరో రెండు స్థానాల కోసం రకరకాల ప్రచారం జరుగుతోంది. కేటీఆర్, హరీశ్​ రావుకు మంత్రివర్గంలో స్థానంపై ఊహాగానాలు నెలకొన్నాయి. ఇద్దరికీ మంత్రివర్గంలో స్థానం ఉంటుందని కొందరు చెబుతుండగా.. కేటీఆర్ మాత్రం కచ్చితంగా మంత్రి అవుతారని పార్టీలో చర్చించుకుంటున్నారు. విస్తరణలో ప్రస్తుత మంత్రివర్గంలోనూ మార్పులు జరగొచ్చునని ప్రచారం జరుగుతోంది. మంత్రి ఎప్పుడవుతారని కేటీఆర్​ను మీడియా ప్రతినిధులు అడిగినప్పుడల్లా.. అది ముఖ్యమంత్రిని అడగాల్సిన ప్రశ్న అంటూ దాటవేస్తున్నారు.

మార్పులు ఉంటాయా?

కొందరు మంత్రులు బాధ్యత వహించిన పార్లమెంటు ఎన్నికల్లో పేలవమైన ఫలితాలు వచ్చాయి. అయితే జాతీయ, ఇతర అంశాలు ప్రభావితం చేశాయా లేక మంత్రుల పనితీరులో లోపముందా అనే విషయాన్ని పార్టీ నాయకత్వం లోతుగా విశ్లేషించింది. వివిధ అంశాల ప్రాతిపదికగా మంత్రుల పనితీరును మదించనున్నట్లు సమాచారం.

ఇదీ చూడండి: కొత్త పురపాలక చట్టం బిల్లుకు ఆమోదం తెలపని గవర్నర్​

Intro:Body:Conclusion:
Last Updated : Jul 23, 2019, 7:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.