ETV Bharat / city

చట్ట సవరణ ముసాయిదా బిల్లులకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం

author img

By

Published : Oct 10, 2020, 8:57 PM IST

Updated : Oct 10, 2020, 10:38 PM IST

cm kcr
cm kcr

20:55 October 10

చట్ట సవరణ ముసాయిదా బిల్లులకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం

అంతర్జాతీయ పరిణామలు, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల నేపథ్యంలో మొక్కజొన్న సాగు విషయమై రాష్ట్ర రైతులు ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర మంత్రివర్గం కోరింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్​లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో యాసంగి పంటల సాగు, వానాకాలం పంటల కొనుగోళ్లు, జీహెచ్ఎంసీ సహా ఇతర చట్టాల సవరణలపై చర్చించింది. మొక్కజొన్న పంటకు కనీస మద్దతు ధర రాకుండా పోవడంపై ఆందోళన వ్యక్తం చేసిన మంత్రివర్గం... కేంద్రం నిర్ణయాలు కారణమని వ్యాఖ్యానించింది.  

రైతుల ప్రయోజనాలను విస్మరించింది

దేశంలో వ్యవసాయ రంగానికి కేంద్ర నిర్ణయాలు గొడ్డలిపెట్టుగా మారడం శోచనీయమని... కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలతో వ్యవసాయ రంగానికి, ప్రత్యేకించి మొక్కజొన్న పంటకు కనీస మద్దతు ధర లభించని దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యకం చేసింది. దేశంలో అవసరానికి మించి మొక్కజొన్న నిల్వలున్నప్పటికీ రైతుల ప్రయోజనాలను విస్మరించి, ఇతర దేశాలనుంచి దిగుమతి చేసుకోవాలన్న కేంద్రం ఆలోచన పట్ల మంత్రివర్గం  విస్మయం వ్యక్తం చేసింది. సంప్రదాయంగా మొక్కజొన్నపంటను సాగుచేసే తెలంగాణ రైతుకు కనీస మద్దతు ధర రాకుండాపోయే గడ్డుకాలం వచ్చిందని ఆందోళన వ్యక్తం చేసింది.  

6వేల ధాన్యం కేంద్రాల ఏర్పాటు

మొక్కజొన్నల నిల్వలు ప్రజావసరాలకు మించి ఉండడంతో పాటు కేంద్ర నిర్ణయాల నేపథ్యంలో మొక్కజొన్న సాగు విషయంలో రాష్ట్ర రైతులు ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని కోరింది. కరోనా ఇంకా పూర్తిగా సమసిపోనందున రైతులకు ఎలాంటి ఇబ్బందులు వాటిల్లకుండా గత అనుభవాల దృష్ట్యా గ్రామాల్లోనే వరిధాన్యం సేకరణ చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందుకోసం ఆరువేల ధాన్యం సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఎన్ని రోజులైనా చివరి గింజవరకూ కొనుగోలు చేయాలని నిర్ణయించిన మంత్రివర్గం... అన్నదాతలు గాబరా పడాల్సిన అవసరం లేదని కోరింది. ధాన్యంలో తేమను 17 శాతానికి మించకుండా చూసుకుని తాలు, పొల్లు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తేవాలని సూచించింది.

చట్టసవరణ ముసాయిదా బిల్లుకు ఆమోదం

మంగళవారం శాసనసభలో ప్రవేశపెట్టాల్సిన చట్టసవరణల ముసాయిదా బిల్లులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గ్రేటర్ హైదరాబాద్ పాలకమండలిలో 50శాతం ప్రాతినిధ్యానికి చట్టబద్ధత కల్పించడంతో పాటు వార్డు కమిటీల పనివిధానం, వార్డుల రిజర్వేషన్ల అంశాలకు సంబంధించి జీహెచ్ఎంసీ చట్టానికి సవరణలు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకొంది. వ్యవసాయ భూమి నుంచి వ్యవసాయేతర భూమిగా మార్చేక్రమంలో సంబంధిత అధికారి విచక్షణాధికారం దుర్వినియోగానికి గురికాకుండా ధరణి పోర్టల్ ద్వారా ఆన్ లైన్​లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటును పౌరులకు కల్పిస్తూ నాలా చట్ట సవరణకు సవరణకు మంత్రిమండలి నిర్ణయించింది. రిజిస్ట్రేషన్ చట్టానికి సవరణలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.  

గడువు పొడగింపు

రాష్ట్రంలో కొనసాగుతున్న ఆన్ లైన్​లో ఆస్తుల నమోదుకు మరో పదిరోజుల పాటు అక్టోబర్ 20 తేదీ వరకు గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకొంది. హెచ్ఎండీఎ పరిధిలో ఇంటిగ్రేటెడ్ టౌన్ షిప్ విధానంపై కూడా మంత్రివర్గం చర్చించింది.

ఇదీ చదవండి : వానాకాలం పంట వరిధాన్యం సేకరణ విధానాన్ని ప్రకటించిన ప్రభుత్వం

Last Updated : Oct 10, 2020, 10:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.