Telangana BJP MLAs: శాసనసభ సమావేశాల నేపథ్యంలో భాజపా ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్ హైదరాబాద్‌లోని గన్‌పార్క్ వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. శాసనసభలో విధానపరమైన నిర్ణయాలపైనే ప్రసంగం ఉంటుందని చెప్పారు. 50 ఏళ్ల నుంచి వస్తున్న విధానాన్ని కేసీఆర్ అపహాస్యం చేశారని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన కేసీఆర్‌కు సీఎం పదవిలో కొనసాగే హక్కు లేదని ముక్తకంఠంతో అన్నారు.
BJP MLAs About Assembly Sessions: స్పీకర్ కుర్చీని అడ్డుపెట్టుకుని మైకులు కట్ చేస్తున్నారని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని విమర్శించారు. గతంలో కేసీఆర్ గంటల తరబడి మాట్లాడారని.. ఇప్పుడు నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
"భాజపా ఎమ్మెల్యేలు ముగ్గురమే ఉన్నాం. రాష్ట్ర ప్రజలంతా మావైపే ఉన్నారు. అన్ని వర్గాల ప్రజల సమస్యలపై అసెంబ్లీలో గొంతెత్తుతాం. అవకాశం ఇవ్వకపోతే ప్రజలతో కలిసి పోరాడతాం. శాసనసభను కేసీఆర్ కించపరుస్తున్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నియంత పాలన సాగుతోంది. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం గ్లలీ నుంచి దిల్లీ వరకు పోరాటం సాగిస్తాం."
- తెలంగాణ భాజపా ఎమ్మెల్యేలు