ETV Bharat / city

TELANGANA ASSEMBLY SESSION : రేపటి నుంచి శాసనసభ సమావేశాలు

రేపట్నుంచి శాసనసభ సమావేశాలు (TELANGANA ASSEMBLY SESSION) ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ, మండలి సమావేశాల్లో చర్చించే అంశాలు, పనిదినాలపై రేపు స్పష్టత రానుంది. దళితబంధు పథకం అమలు సహా పంటలసాగు, తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు, ఉద్యోగాల నియామకం, ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీల పెంపు సహా ఇతర అంశాలు ఈ సమావేశాల్లో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. మొత్తం 8 బిల్లులను ప్రభుత్వం ఉభయసభల్లో ప్రవేశపెట్టనుంది.

TELANGANA ASSEMBLY SESSION
TELANGANA ASSEMBLY SESSION
author img

By

Published : Sep 23, 2021, 5:19 AM IST

TELANGANA ASSEMBLY SESSION : రేపటి నుంచి శాసనసభ సమావేశాలు

శాసనసభ సమావేశాలకు రంగం సిద్ధమైంది. రేపటి నుంచి శాసనసభ, శాసనమండలి సమావేశం (TELANGANA ASSEMBLY SESSION) కానున్నాయి. ఉదయం 11 గంటల నుంచి ఉభయ సభల సమావేశాలు ప్రారంభమవుతాయి. సమావేశాల అజెండా, పనిదినాలు రేపు ఖరారు కానున్నాయి. ఇందుకోసం అసెంబ్లీ, మండలి సభా వ్యవహారాల సలహా సంఘాలు- బీఏసీ భేటీ అవుతాయి. సమావేశాలు నిర్వహించే పనిదినాలు, చర్చించాల్సిన అంశాలు, ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులను ఈ భేటీలో ఖరారు చేస్తారు.

దళిత బంధుపై..

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకంపై సమావేశాల్లో ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తోంది. యాదాద్రి జిల్లా వాసాలమర్రి, హజూరాబాద్ నియోజకవర్గాలతో పాటు మరో 4 నియోజకవర్గాల్లో ఒక్కో మండలం చొప్పున పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు. దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా పథకాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా దళిత బంధు పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న ప్రతిపక్షాలు.. ఇతర వర్గాలకు ఈ తరహా పథకం తేవాలని కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో దళితబంధుపై శాసనసభ సమావేశాల్లో విస్తృత చర్చ జరిగే అవకాశం ఉంది.

8 బిల్లులు..

పంటల సాగు, ధాన్యం కొనుగోళ్లు, నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం, ఆంధ్రప్రదేశ్​తో జలవివాదాలు, కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ సహా ఇతర అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అంశాలు ప్రస్తావన కొచ్చే అవకాశం ఉంది. శాంతి భద్రతలు, మహిళలు-చిన్నారులపై దాడులు, డ్రగ్స్ అంశం, ఆర్టీసీ, విద్యుత్ వంటి అంశాలు శాసనసభలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఛార్జీలు పెంచాలని ఆర్టీసీ, విద్యుత్ సంస్థలు కోరిన తరుణంలో ఆయా సంస్థల ఆర్థిక పరిస్థితి, భవిష్యత్‌ కార్యాచరణ, ఛార్జీల పెంపుపై శాసనసభ సమావేశాల్లో చర్చించే ఛాన్స్​ ఉంది. ఈ సమావేశాల్లో ఉభయ సభల ముందుకు 8 బిల్లులు వచ్చే అవకాశం కనిపిస్తోంది.

పర్యాటకుల కోసం ప్రత్యేక చట్టం..

రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ, కొండా లక్ష్మణ్ ఉద్యానవన విశ్వవిద్యాలయాల చట్టాలు సవరిస్తూ గతంలో జారీచేసిన ఆర్డినెన్స్‌ల స్థానంలో బిల్లులు ప్రవేశపెట్టనున్నారు. పర్యాటకులు, ప్రయాణికులకు దళారులు, ఇతరుల ఆగడాలను నిలువరించేలా తీసుకొస్తున్న ప్రత్యేక చట్టం కోసం బిల్లు ప్రవేశపెట్టనున్నారు. రిజిస్ట్రేషన్లు, జీఎస్టీ, పురపాలక, పంచాయతీరాజ్​ చట్టాల సవరణ బిల్లులు ఉభయసభల ముందుకు రానున్నాయి.

అధికారులతో సభాపతులు భేటీ..

సమావేశాల నేపథ్యంలో అన్ని శాఖల కార్యదర్శులతో సమావేశమైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్... సన్నద్ధతపై సమీక్షించారు. సభ్యుల ప్రశ్నలు, ప్రస్తావించే అంశాలకు సమాధానాలు త్వరగా పంపాలని... పెండింగ్ అంశాలన్నింటినీ యుద్ధప్రాతిపదిక పూర్తి చేయాలని స్పష్టం చేశారు. సమావేశాల నిర్వహణపై ప్రభుత్వ అధికారులతో పాటు పోలీసు అధికారులతో శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, మండలి ప్రొటెం ఛైర్మన్ భూపాల్​ రెడ్డి ఇవాళ సమావేశం కానున్నారు.

ఇదీచూడండి: Ts Assembly session : ఈనెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.