ETV Bharat / city

అవినీతికి అడ్డుకట్ట.. పారదర్శకతకు పెద్దపీట - నాలా చట్టం వార్తలు

వ్యవసాయ భూములను వ్యవసాయేతరంగా మార్చే బదలాయింపు ప్రక్రియలో అధికారులకు ఉన్న విచక్షణాధికారాల వల్ల ప్రక్రియ జాప్యంతో పాటు అవకతవలకు ఆస్కారం కలుగుతోందన్న ప్రభుత్వం... నాలా చట్టానికి సవరణ చేసింది. ఈ బిల్లును ముఖ్యమంత్రి తరఫున మంత్రి ప్రశాంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఆ సవరణలకు శాసనసభ ఆమోదం తెలిపింది.

ts assembly
ts assembly
author img

By

Published : Oct 14, 2020, 6:33 AM IST

రెవెన్యూ అధికారుల విచక్షణాధికారాలకు ప్రభుత్వం కత్తెర వేసింది. పారదర్శకతకు పెద్దపీట వేసేందుకు ఆన్‌లైన్‌లోనే భూమి హక్కు పత్రం ఇచ్చేలా తెలంగాణ రాష్ట్ర భూముల(నాలా) చట్టం-2016లో సవరణలు చేసింది. రాష్ట్ర శాసనసభలో చట్ట సవరణ బిల్లును రాష్ట్ర రహదారులు-భవనాలు, శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మంగళవారం ప్రవేశపెట్టారు. ఇక నుంచి నిర్దిష్ట కాలవ్యవధితో వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చుకునేందుకు చట్టంలో వెసులుబాటు కల్పించారు. ఆ సవరణలకు శాసనసభ ఆమోదం తెలిపింది.

ప్రస్తుత చట్టంలో ఏముంది

  • వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చేందుకు ఆర్టీవోలకు విచక్షణాధికారాలు ఉన్నాయి.
  • గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో భూమార్పిడికి రెండు శాతం, ఇతర ప్రాంతాల్లో మూడు శాతం పన్ను చెల్లించాలి.
  • అధికారికంగా అనుమతి పొందకుండా వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాలకు వినియోగిస్తున్న పక్షంలో 50 శాతాన్ని అపరాధ రుసుముగా వసూలు చేసి భూమార్పిడి నిర్వహిస్తారు. ఈ దరఖాస్తుల పర్యవేక్షణకు ప్రత్యేక వ్యవస్థ లేదు.

తాజా సవరణతో రానున్న మార్పులు

  • ఆర్డీవో తదితర అధికారులకు ఉన్న విచక్షణ అధికారాలు పూర్తిగా రద్దవుతాయి.
  • దరఖాస్తుదారుడు నేరుగా ఆన్‌లైన్‌ ద్వారా ధరణిలో నమోదు చేసుకోవచ్చు. పెండింగులో ఉన్న దరఖాస్తులను బట్టి స్లాట్‌ ఖరారవుతుంది.
  • నిర్ధారిత తేదీ, సమయానికి దరఖాస్తుదారు అన్ని పత్రాలతో హాజరైతే అధికారులు వ్యవసాయేతర భూమికి సంబంధించిన హక్కు పత్రాన్ని(ఈ-పాస్‌బుక్‌) ఇస్తారు. అనంతరం పాసు పుస్తకాన్ని అందజేస్తారు.
  • 15 రోజుల వ్యవధిలో ప్రక్రియను పూర్తి చేయాలన్నది లక్ష్యం.
  • ఎలాంటి వివాదాలు లేని కోటి ఎకరాలకు పైగా భూవివరాలను ధరణి వెబ్‌సైట్‌లో నమోదు చేశారు. ఆయా భూములకు సంబంధించిన మార్పిడి వ్యవహారాలను తొలిదశలో నిర్వహిస్తారు.

ఇదీ చదవండి : నాలుగు చట్టసవరణ బిల్లులకు అసెంబ్లీ ఆమోదం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.