ETV Bharat / city

AP bifurcation Issues: 'కోర్టు కేసుల్ని వెనక్కి తీసుకుంటే.. సమస్యల పరిష్కారానికి సిద్ధం' - ap civil supplies on telangana

Telangana-AP bifurcation Issues
Telangana-AP bifurcation Issues
author img

By

Published : Feb 17, 2022, 7:18 PM IST

Updated : Feb 17, 2022, 7:55 PM IST

19:14 February 17

'కోర్టు కేసుల్ని ఏపీ వెనక్కి తీసుకుంటే.. విద్యుత్ బకాయిల సమస్య పరిష్కారానికి సిద్ధం'

AP bifurcation Issues: ఏపీ, తెలంగాణ మధ్య విభజన సమస్యల పరిష్కారానికి కేంద్ర హోంశాఖ నియమించిన ఉపసంఘం తొలి భేటీ ఇవాళ జరిగింది. తెలంగాణ ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఏపీ ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్​ఎస్​ రావత్​తో దృశ్యమాధ్యమం ద్వారా కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి సమావేశం అయ్యారు. ఈ భేటీలో కొన్ని కీలక సమస్యల పరిష్కారానికి అడుగులు పడ్డాయి. బకాయిల చెల్లింపునకు ఏపీ, తెలంగాణ అధికారుల మధ్య అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది.

ఇరు రాష్ట్రాల మధ్య విద్యుత్ బకాయిల అంశంపై కీలక చర్చ జరిగినట్లు సమాచారం. కోర్టు కేసులను ఏపీ ఉపసంహరించుకుంటే విద్యుత్ బకాయిల సమస్య పరిష్కారానికి సిద్ధమని తెలంగాణ స్పష్టం చేసింది. కేసుల ఉపసంహరణతోనే ఏపీఎస్‌ఎఫ్‌సీ -ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన సైతం సాధ్యమని తెలంగాణ పేర్కొంది. పన్నులకు సంబంధించి విభజన చట్ట సవరణ అవసరం లేదని తెలిపింది. తెలంగాణ వాదనతో కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి ఆశిష్​కుమార్ ఏకీభవించారు. ఫలితంగా పన్నుల అంశం ద్వైపాక్షిక జాబితా నుంచి తొలగించేందుకు అంగీకారం కుదిరింది.

అయితే ఏపీ నుంచి నగదు బకాయిలు వెంటనే వచ్చేలా చూడాలని తెలంగాణ కోరింది. రాజ్‌భవన్, హైకోర్టు నిర్వహణ బకాయిలు కూడా రాలేదని పేర్కొంది. దీనిపై స్పందించిన కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి.. ఏపీ నగదు బకాయిల వివరాలు పంపాలని సూచించారు. కేంద్ర రాయితీలో తెలంగాణ వాటా చెల్లించేందుకు సిద్ధమని ఏపీ అధికారులు ప్రతిపాదించారు. దీనిపై అండర్ టేకింగ్ ఇచ్చేందుకు ఏపీ పౌరసరఫరాల సంస్థ సిద్ధమని ప్రకటించింది. ఏపీ అండర్ టేకింగ్, రాయితీ వాటా ఇస్తే రూ.354 కోట్ల చెల్లింపునకు తెలంగాణ పౌరసరఫరాల సంస్థ అంగీకారం తెలిపింది.

ఇదీచూడండి: KTR At Kandlakoya IT Park: కేసీఆర్​ రాజకీయాలను వీడి ఉంటే తెలంగాణ వచ్చేదా: కేటీఆర్​

Last Updated : Feb 17, 2022, 7:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.