ETV Bharat / city

అసంపూర్ణంగా ముగిసిన "విభజన" భేటీ

author img

By

Published : Oct 10, 2019, 5:17 AM IST

Updated : Oct 10, 2019, 7:54 AM IST

కట్టె విరగదు.. పాము చావదన్నట్లు తయారైంది.. తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలు.. దిల్లీలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి నిర్వహించిన భేటీ అసంపూర్ణంగా ముగిసింది. ఇరురాష్ట్రాల సీఎస్​లతో చర్చించిన అంశాలపై తుది నిర్ణయం తీసుకోకుండానే వాయిదా పడింది.

అసంపూర్ణంగా ముగిసిన "విభజన" భేటీ

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి నిర్వహించిన భేటీ అసంపూర్ణంగా ముగిసింది. తెలుగు రాష్ట్రాల అధికారులతో చర్చించిన అంశాలపై తుది నిర్ణయం తీసుకోకుండానే వాయిదా పడింది. ఈ భేటీ కేంద్ర హోంశాఖ నూతన కార్యదర్శి అజయ్‌భల్లా ఆధ్వర్యంలో జరిగింది. ఆంధ్రప్రదేశ్‌ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం హాజరుకాగా... తెలంగాణ నుంచి సీఎస్​ ఎస్‌కే జోషి, అకున్‌ సబర్వాల్‌లు పాల్గొన్నారు.

చర్చ ఇలా మొదలుపెట్టారు..!

షెడ్యూల్‌ 9, 10 సంస్థలు, ఏపీ భవన్‌ విభజన, విద్యుత్తు బకాయిలు, పన్ను బకాయిల పంపిణీ, విద్యుత్తు ఉద్యోగుల విభజన, ఇరురాష్ట్రాల మధ్య పాత రుణాలు, వడ్డీల విభజన, ఏపీ పౌరసరఫరాల శాఖ క్రెడిట్‌ అకౌంట్‌ ద్వారా తెలంగాణలో జరిపిన కొనుగోళ్లకు చేసిన రూ. 1,700 కోట్ల బకాయిల గురించి ప్రధానంగా చర్చ జరిగింది.

ఎటూ తేల్చలేదు..

ఈ సమావేశానికి సంబంధించి హోంశాఖ అజెండా ఏదీ ఖరారు చేయలేదని తెలిసింది. అపరిష్కృతంగా ఉన్న అన్ని అంశాలపైనా చర్చించినట్లు అధికారవర్గాలు పేర్కొన్నాయి. దిల్లీలోని ఏపీ భవన్‌లో ఇరురాష్ట్రాల వ్యవహారాలు సున్నితంగా సాగుతున్నందున దాని గురించి పెద్దగా మాట్లాడలేదని తెలిపారు.

తదుపరి భేటీ ఎప్పుడో.?

మొత్తానికి హోంశాఖ కార్యదర్శి స్థాయిలో ఏడాదిన్నర తర్వాత జరిగిన ఈ సమావేశం ఎలాంటి నిర్ణయాలు లేకుండానే ముగిసింది. తదుపరి భేటీ ఎప్పుడన్నది నిర్ణయించలేదు.

చర్చకు వచ్చిన అంశాలు

  1. విద్యుత్తు బకాయిల విషయంలో భేదాభిప్రాయాలు లేవు.. కోట్ల రూపాయల బకాయిలు చెల్లించడానికి తెలంగాణ సానుకూలం.
  2. ఎస్సైలు, సీఐలు, డీఎస్పీలకు ప్రమోషన్ల అంశంపై చర్చ: ఫ్రీ జోన్‌లో ఎక్కువమంది ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారే ఉన్నారు. ప్రమోషన్లు ఇస్తామంటూ తెలంగాణ ప్రభుత్వం చేసిన వాదనను హోంశాఖ అంగీకరించలేదు. హైకోర్టు జారీచేసిన ఆదేశాల ప్రకారం సీనియారిటీని నిర్ధారించాలన్న ఏపీ వాదన సమర్థించింది.
  3. 9వ షెడ్యూల్‌లోని 68 సంస్థలకు సంబంధించిన విభజనపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ తెలంగాణ ప్రభుత్వం ఈ సమావేశంలో ఒక జాబితాను సమర్పించింది. దాన్ని హోంశాఖ కార్యదర్శి ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చి స్పందన తెలియజేయాలని సూచించారు.
  4. తెలంగాణ ఏర్పడిన ఏడాది తర్వాత ఆ రాష్ట్రంలో పౌరసరఫరాల శాఖను ఏర్పాటు చేసుకుంది. అంతవరకు ఏపీ ప్రభుత్వమే ఆ రాష్ట్రం తరఫున గ్యారంటీలు ఇవ్వడంతోపాటు అప్పులు చెల్లించింది. దీని విలువ ఎంతో నిర్ధారించి ఆ మేరకు ఏపీకి ఇవ్వాలని హోంశాఖ సూచించింది. అందుకు తెలంగాణ అంగీకరించింది.
  5. 10వ షెడ్యూల్‌ సంస్థల విభజనపై సుప్రీం కోర్టు తీర్పునకు విరుద్ధంగా హోంశాఖ ఉత్తర్వులు జారీచేసిందంటూ ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై న్యాయసలహా తీసుకొని మళ్లీ తమ అభిప్రాయం వెల్లడిస్తామని హోంశాఖ అధికారులు హామీ ఇచ్చారు.
  6. సింగరేణి కాలరీస్‌ విషయంలో విభజన చట్టంలోనే లోపాలున్నాయి. 9వ షెడ్యూల్‌ ప్రకారం సింగరేణి సంస్థను విభజించాల్సి ఉంది. అదే సమయంలో ఆస్తుల నిష్పత్తి ప్రాతిపదికన తెలంగాణకు బదలాయించాలని చెప్పినట్లు ఏపీ అధికారులు తెలపగా దీనిపై పరిశీలించి ఏం చేయాలో తగు నిర్ణయం వెలువరిస్తామని హోంశాఖ అధికారులు హామీ ఇచ్చారు.
  7. షెడ్యూల్‌ 9, 10 ఆస్తుల విభజన నిర్ణీత కాలంలోగా జరగాలని హోంశాఖ అధికారులు ఇరురాష్ట్రాలకు స్పష్టంచేశారు.

Intro:Body:Conclusion:
Last Updated : Oct 10, 2019, 7:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.