ETV Bharat / city

ఆ సంస్థ రాష్ట్రంలో పరిశ్రమలు పెడితే సంపూర్ణ సహకారం అందిస్తాం: నిరంజన్ రెడ్డి

Minister Niranjan Reddy in Maharashtra Tour: మహారాష్ట్రలో విభిన్న రకాల పంటల సాగు ఎంతో బాగుందని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి అన్నారు. జల్‌గావ్‌ ప్రాంతంలోనే 1.25లక్షల ఎకరాల్లో అరటి సాగు ఆదర్శనీయమని పేర్కొన్నారు. జైన్‌హిల్స్‌లో.. ప్రపంచంలోనే అతి పెద్ద మామిడి ప్రాసెసింగ్‌ ప్లాంట్‌, టిష్యూకల్చర్ ల్యాబ్‌లు ఉండడం... దేశానికి గర్వకారణమని తెలిపారు. జల్గావ్‌ ప్రాంత అభ్యున్నతికి జైన్‌ సంస్థ చేస్తున్న కృషి.. అత్యద్భుతమని మంత్రి కొనియాడారు. జైన్‌ సంస్థ తెలంగాణలో పరిశ్రమలు పెడితే సంపూర్ణ సహకారం అందిస్తామని అన్నారు.

Minister Niranjan Reddy
మహారాష్ట్ర పర్యటనలో మంత్రి నిరంజన్‌ రెడ్డి
author img

By

Published : Mar 20, 2022, 2:20 PM IST

Minister Niranjan Reddy in Maharashtra Tour: మహారాష్ట్ర పర్యటనలో భాగంగా.. మూడో రోజు జల్గావ్‌లోని జైన్‌ మైక్రో డ్రిప్‌ ఇరిగేషన్‌, ప్లాస్టిక్ పార్కు, ప్రపంచంలోనే అతిపెద్ద టిష్యూ కల్చర్ ల్యాబ్‌, ఉల్లి విత్తన క్షేత్రాలను రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి సందర్శించారు. అనంతరం జైన్ సంస్థల ఎండీ అజిత్‌ జైన్‌లో భేటీ అయ్యారు. జల్గావ్‌ స్పూర్తితో తెలంగాణలో అరటి సాగును ప్రోత్సహిస్తామని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో విప్లవాత్మక మార్పు కోసం కృషి చేస్తున్నామని ఈ సమావేశంలో పేర్కొన్నారు.

Minister Niranjan Reddy
మహారాష్ట్ర పర్యటనలో మంత్రి నిరంజన్‌ రెడ్డి

'కొంతమంది కర్షకులు అరటిసాగు వైపు మళ్లినా.. మిగతా రైతులకు అది దారి చూపుతుంది. సీఎం కేసీఆర్ రైతును అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నారు. ఐదు వేల ఎకరాలకు ఒక క్లస్టర్ ఏర్పాటు చేసుకున్నామని...పప్పు, నూనె గింజల వంటి ప్రత్యామ్నాయ పంటల దిశగా రైతులను మళ్లిస్తున్నాం. ఆఫ్లాటాక్సిన్‌ రహిత తెలంగాణ వేరుశెనగకు అంతర్జాతీయ విపణిలో మంచి డిమాండ్ ఉంది. జైన్‌ సంస్థ తెలంగాణలో పరిశ్రమలు పెడితే సంపూర్ణ సహకారం అందిస్తాం.'

-నిరంజన్‌ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి

రెండో రోజు పర్యటనలో భాగంగా..

Niranjan Reddy in Maharashtra Tour: మహారాష్ట్ర పర్యటనలో భాగంగా.. రెండో రోజు జల్గావ్ సమీపంలోని జైన్ హిల్స్ లో.. ఉద్యాన సాగు, ప్రపంచంలోనే అతిపెద్ద మామిడి ప్రాసెసింగ్ ప్లాంట్, టిష్యూ కల్చర్ మొక్కల తయారీ.. అల్లం, ఆలు, టొమాటో పంటల సాగును మంత్రి నిరంజన్‌ రెడ్డి పరిశీలించారు. పంటల సాగుతో పాటు.. వాటి ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు ఎంతో ముఖ్యమని నిరంజన్‌రెడ్డి తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో వ్యవసాయానికి.. 24 గంటల ఉచిత కరెంటు, రైతుబంధు, రైతు బీమా పథకాలతో అన్నదాతకు అండగా నిలుస్తున్నాయని.. మంత్రి నిరంజన్‌రెడ్డి వివరించారు.

'ఇక్కడ ఉత్పత్తి అవుతున్న మొక్కలు ఉద్యానపంటల వైపు మళ్లుతున్న రైతాంగానికి ఎంతో ఉపయోగకరం. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో పంటల వైవిద్యీకరణ మీద దృష్టి సారించామని... పంటల మార్పిడి వైపు అడుగులు వేస్తున్న రాష్ట్రానికి ఇక్కడ ఉన్నటువంటి వసతులు, ల్యాబ్​లు ఎంతో అవసరం. 544 మిల్లీమీటర్ల అతి తక్కువ వర్షపాతం ఉన్న జల్గావ్​లో నీటి వినియోగం తీరు రైతాంగానికి ఆదర్శం. ఇక్కడ పెద్ద ఎత్తున ఫాం పాండ్​లు నిర్మించుకుని వాటిలో ఒడిసిపట్టుకున్న నీటితోనే పంటలు పండించుకుంటున్నారు. కేసీఆర్ చొరవ వల్ల తెలంగాణ రైతాంగానికి సాగునీటి గోస తీరిందని...రైతులు సాంప్రదాయ పంటల సాగును వదిలేసి.. లాభదాయక పంటల వైపు అడుగులు వేయాలి. జైన్ సంస్థ స్ఫూర్తితో తెలంగాణలో పంటల మార్పిడి దిశగా రైతులను తీసుకెళ్తాం.'

-సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి

మంత్రి వెంట ఎమ్మెల్యేలు బాల్క సుమన్, గండ్ర వెంకట రమణారెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, ఉద్యాన శాఖ డైరెక్టర్ వెంకట్రామ్ రెడ్డి, ఉన్నతాధికారులు సరోజిని దేవి, సుభాషిణి, స్థానిక మాజీ ఎమ్మెల్యే రాజారాం మహాజన్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ నందు మహాజన్ తదితరులు ఉన్నారు.

ఇదీ చదవండి:KCR on yasangi: 'యాసంగి వరి పంట మొత్తం కేంద్రం కొనాల్సిందే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.