ETV Bharat / city

Minister Niranjan Reddy : నల్ల చట్టాలతో రైతులను వంచించే కేంద్రానికి.. ఆ శక్తి లేదా?

లక్షల కోట్ల రూపాయలను కార్పొరేట్లకు ధారాదత్తం చేసే కేంద్రానికి రైతుల కోసం వేల కోట్లు ఖర్చు పెట్టే శక్తి లేదా అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి(Minister Niranjan on paddy procurement) ప్రశ్నించారు. నల్లచట్టాలతో రైతులపై కేంద్రం కత్తి వేలాడదీస్తోందని మండిపడ్డారు. గత యాసంగి వరి ధాన్యం కొనుగోలు చేయకుండా కర్షకులను అయోమయానికి గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి

author img

By

Published : Nov 13, 2021, 12:28 PM IST

రైతుల కోసం వేల కోట్లు ఖర్చు చేసే శక్తిలేదా కేంద్రానికి

రైతుల(farmers)ను గోస పెట్టిన ఏ ప్రభుత్వం బతికిబట్టకట్టలేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి(Telangana agriculture minister Niranjan reddy) పునరుద్ఘాటించారు. లక్షల కోట్లను కార్పొరేట్లకు ధారాదత్తం చేసే కేంద్రం.. కర్షకుల కోసం వేల కోట్లు ఖర్చు చేయలేదా అని ప్రశ్నించారు. మూడు నల్ల చట్టాల(New agriculture laws)తో రైతుల మెడపై కేంద్రం కత్తి వేలాడదీస్తోందని వాపోయారు. కర్షకులను కష్టపెట్టే ప్రభుత్వాలకు ఉసురు తగులుతుందని అన్నారు. యాసంగిలో పండించేదే బాయిల్డ్ రైస్(para boiled rice procurement) అని.. ఆ ధాన్యాన్ని కూడా కొనుగోలు(paddy procurement) చేయం అంటే అన్నదాతలు ఏం చేస్తారని నిలదీశారు. రైతులను అయోమయానికి గురిచేయొద్దని సూచించారు.

తెలంగాణ భాజపా(Telangana BJP) నేతలు అపరిపక్వత లేని మాటలు మాట్లాడుతున్నారని మంత్రి నిరంజన్ రెడ్డి(minister Niranjan reddy) అన్నారు. దమ్ముంటే.. కేంద్రం నుంచి యాసంగి వడ్లు కొంటామనే ఉత్తర్వులు తీసుకురావాలని సవాల్ చేశారు. ఏ రాష్ట్రమైన తన అభివృద్ధిలో మందగమనం చూపిస్తే.. పరుగు పెట్టించాల్సిన కేంద్రమే(central government) నిద్రపోతే.. రాష్ట్రాలు నిద్రలేపాల్సిన దుస్థితి ఉందని పేర్కొన్నారు. కేంద్ర సర్కార్ నుంచి సహాయసహకారాలు అందకపోయినా.. తెలంగాణ ప్రభుత్వం తన పరిధిలో ఉన్నంతలో అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తోందని స్పష్టం చేశారు.

"108 కోట్ల జనాభాలో 20-22 కోట్ల మందికి ఇప్పటికీ తిండిగింజలు లేవు. దేశంలోని ధాన్యం నిల్వలను పేదలకు పంచవచ్చు. దేశంలో ఇప్పటికి కూడా ఎంతోమందికి ఆహారం దొరకట్లేదు. రైతుల కోసం వేల కోట్లు ఖర్చు చేసే శక్తి కేంద్ర ప్రభుత్వానికి లేదా? నూనెగింజల ఉత్పత్తిని పెంచాలని మేం కృషి చేస్తున్నాం. వంట నూనెల దిగుమతి కోసం 80 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. దేశంలోనే నూనెగింజల ఉత్పత్తితి కేంద్రం ఎందుకు చర్యలు చేపట్టడం లేదు?. పంట మార్పిడికి అవసరమైన ప్రోత్సాహకం అందించట్లేదు. దేశవ్యాప్తంగా పంట మార్పిడికి కేంద్రమే ఒక విధానాన్ని ప్రకటించొచ్చు. మొత్తం వ్యవస్థలను కేంద్రం చేతుల్లోనే ఉన్నాయి. కొత్త మార్గాలు అన్వేషించకుండా రైతులను గోస పెడుతున్నారు. దిల్లీలోని కేంద్ర పెద్దలు చెప్పే విషయాలను మీ శ్రేణులకే చెప్పవచ్చు కదా?"

- నిరంజన్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి

62 లక్షల ఎకరాల్లో వానాకాలం పంట(monsoon crop) సాగుచేశామని కేంద్రానికి నివేదిక పంపామని నిరంజన్ రెడ్డి(minister Niranjan reddy) తెలిపారు. రాష్ట్రాలు పంపిన నివేదిక ఆధారంగానే కేంద్రం ఒక అంచనాకు వస్తోందని చెప్పారు. అత్యంత ఆధునిక పద్ధతుల్లో గణంకాలను నమోదు చేశామని వివరించారు. రాష్ట్రంలో పంటల నమోదును చాలా పకడ్బందీగా చేశామని వెల్లడించారు. రాష్ట్ర రైతులను, ప్రభుత్వాన్ని అవమానించేలా కేంద్రం వ్యవహారిస్తోందన్న మంత్రి.. రైతులతో పెట్టుకున్న ఎవరూ ఇప్పటివరకూ బతికి బట్టకట్టలేదని అన్నారు.

వానాకాలం పంట కొనుగోలు(monsoon paddy procurement)కు అన్నీ సిద్ధమయ్యాయని మంత్రి(minister Niranjan reddy) వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. వానాకాలం పంట ఒకేరోజు పంటంతా కోయరని.. పంట వేసిన ప్రకారం కోతలు ఉంటాయని అన్నారు. మార్కెటింగ్, వ్యవసాయ, మెప్మా సెంటర్లు, ఐకేపీ తరఫున పంచాయతీరాజ్ శాఖ.. వానాకాలం పంట కొనుగోళ్లు చేయడానికి సిద్ధం ఉందని వివరించారు.

యాసంగి(rabi season in telangana)కి రైతులు సన్నద్ధమవుతున్నారని మంత్రి చెప్పారు. వరికి బదులు మినుములు, ఇతర పంటలు వేసేందుకు సిద్ధమవుతున్నారని తెలిపారు. లక్షల ఎకరాల్లో వేరుశనగ వేశారని వెల్లడించారు. రైతులను ఇంకా ప్రోత్సహించేందుకు తెలంగాణ సర్కార్ కృషి చేస్తోందని పునరుద్ఘాటించారు. కర్షకుల్లో ఆత్మవిశ్వాసం తగ్గేలా ఎవరు ప్రయత్నించినా ఊరుకునేది లేదని హెచ్చరించారు. మరో రెండ్రోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశమై.. వరి ధాన్యం కొనుగోళ్లపై కార్యాచరణపై చర్చిస్తారని.. రైతుల్లో ఆత్మవిశ్వాసం పెంచే నిర్ణయాలే తీసుకుంటారని నిరంజన్ రెడ్డి(minister Niranjan reddy) స్పష్టం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.