ప్రపంచానికి రాష్ట్ర సాహిత్యాన్ని చేరువ చేసేందుకు తెలంగాణ సాహిత్య అకాడమీ సిద్ధంగా ఉందని... అకాడమీ ఛైర్మెన్ నందిని సిధారెడ్డి అన్నారు. తెలంగాణ సాహిత్య చరిత్రను సేకరించి... ఓ వెబ్‌సైట్ రూపంలో ప్రజల ముందు ఉంచామని ఆయన అన్నారు. హైదరాబాద్ రవీంద్రభారతి ప్రాంగణంలో... అకాడమీ కార్యదర్శి ఏనుగు నర్సింహారెడ్డితో కలిసి వెబ్‌సైట్‌ను ప్రారంభించారు.
వెబ్‌సైట్‌లో సాహిత్య అకాడమీ ప్రచురించిన వంద పుస్తకాలు పొందుపరిచినట్లు తెలిపారు. తెలంగాణ సాహిత్యంపై రూపొందించిన వీడియోలు, సాహిత్యకారుల చరిత్రను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా తెలుసుకోవచ్చన్నారు. tsa.telangana.govt.in కు లాగిన్ అయ్యి... సేవలు పొందవచ్చని సూచించారు.