ETV Bharat / city

టిక్​టాక్​ వీడియోలపై వివరణ ఇవ్వండి: హైకోర్టు - టిక్​టాక్​ వీడియోలపై వివరణ ఇవ్వండి

ట్రాయ్‌, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఐటీ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. టిక్‌టాక్‌ యాప్‌ను నిషేధించాలంటూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనిపై అధికారులను వివరణ కోరిన ధర్మాసనం.. విచారణను జూన్‌ 2కి వాయిదా వేసింది.

state govt on tiktok app
టిక్​టాక్​ వీడియోలపై వివరణ ఇవ్వండి: హైకోర్టు
author img

By

Published : Apr 26, 2020, 5:13 AM IST

కరోనా వ్యాప్తి నేపథ్యంలో రెచ్చగొట్టేలా వీడియోలను తీసి పెట్టేందుకు వీలు కల్పిస్తున్న టిక్‌టాక్‌ యాప్‌ను నిషేధించాలంటూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది అశోక్‌కుమార్‌ రాసిన లేఖను హైకోర్టు పరిగణలోకి తీసుకుంది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్‌, జస్టిస్‌ అభిషేక్‌రెడ్డితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

దీనిపై టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ట్రాయ్‌) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఐటీ శాఖలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీకి నోటీసులు జారీ చేసింది. కరోనా నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన మార్గదర్శకాలను అమలు చేయడం లేదని వ్యాజ్యంలో పేర్కొన్నారు. వైరస్​ వ్యాప్తికి సహకరించేలా టిక్‌టాక్‌లో వీడియోలు తీసి వాట్సప్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్​తో పాటు ఇతర సామాజిక మాధ్యమాల్లో పెడుతున్నారని న్యాయవాది లేఖలో పేర్కొన్నారు.

లేఖను పరిశీలించిన ధర్మాసనం ప్రతివాదలకు నోటీసులు జారీ చేస్తూ విచారణను జూన్‌ 2వ తేదీకి వాయిదా వేసింది.

ఇవీ చూడండి: రాష్ట్రంలో మరికొన్ని ప్రైవేటు యూనివర్సిటీలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.