ETV Bharat / city

డ్రైరన్‌కు సాఫ్ట్‌వేర్‌ తిప్పలు... కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన ఆరోగ్యశాఖ - డ్రైరన్​ వార్తలు

రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం నిర్వహించిన కొవిడ్​ టీకా డ్రైరన్​లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. కొవిన్‌ సాఫ్ట్‌వేర్‌ ముప్పుతిప్పలు పెట్టింది. 1,200 కేంద్రాల్లో డ్రై రన్‌ను నిర్వహించాలని ఆరోగ్యశాఖ నిర్ణయించినా.. సాఫ్ట్‌వేర్‌ సమస్యల కారణంగా 917 చోట్ల మాత్రమే నిర్వహించాల్సి వచ్చింది.

dry run
dry run
author img

By

Published : Jan 9, 2021, 9:01 AM IST

కొవిడ్‌ టీకా పంపిణీలో భాగంగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ముందస్తు సన్నాహకాల్లో(డ్రై రన్‌) కొవిన్‌ సాఫ్ట్‌వేర్‌ ముప్పుతిప్పలు పెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 1,200 కేంద్రాల్లో టీకా పంపిణీకి సంబంధించిన డ్రై రన్‌ను నిర్వహించాలని ఆరోగ్యశాఖ నిర్ణయించినా.. సాఫ్ట్‌వేర్‌ సమస్యల కారణంగా శుక్రవారం 917 చోట్ల మాత్రమే నిర్వహించాల్సి వచ్చింది. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 21,777 మంది లబ్ధిదారులు డ్రై రన్‌లో పాల్గొన్నట్లు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు తెలిపారు. కార్యక్రమం విజయవంతమైనట్లు పేర్కొన్నారు.

రెండు రోజుల్లో తేదీలు ఖరారు

కొవిడ్‌ టీకా ముందస్తు సన్నాహకాలను పరిశీలించడానికి ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని పలు ఆరోగ్య కేంద్రాలను శ్రీనివాసరావు సందర్శించారు. వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిలో డ్రైరన్‌ను పరిశీలించి.. అధికారులతో సమీక్ష నిర్వహించారు. డ్రై రన్‌లో పిన్‌ కోడ్‌ గుర్తించడంలో సాఫ్ట్‌వేర్‌లో తలెత్తిన సమస్యలను రెండు రోజుల్లో పరిష్కరిస్తామన్నారు. ములుగులో ఇంటర్నెట్‌ ఇబ్బందులున్నాయని చెప్పారు. వాటిని అధిగమించడానికి చర్యలు చేపడతామన్నారు. టీకా పంపిణీకి రెండు రోజుల్లో తేదీ ఖరారు కావచ్చన్నారు.

ఏమిటీ సమస్య?

కొవిన్‌ వెబ్‌ యాప్‌లో లబ్ధిదారుడి సమాచారాన్ని పొందుపరిచే క్రమంలో పేరు, వయసు, ఫోన్‌ నంబరు, చిరునామాతో పాటు తప్పనిసరిగా పిన్‌కోడ్‌ను కూడా చేర్చాలి. పిన్‌కోడ్‌ చేర్చకపోతే కొవిన్‌ వెబ్‌ యాప్‌లో లబ్ధిదారుడి సమాచారం చేరదు. ఒక పిన్‌కోడ్‌ పరిధిలో ఉన్న ప్రాంతాల్లో మూణ్నాలుగు కొవిడ్‌ టీకా పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి వచ్చినప్పుడు.. లబ్ధిదారుడికి సమీప కేంద్రంలో కాకుండా మరో కేంద్రంలోకి టీకా పంపిణీ ప్రదేశాన్ని సాఫ్ట్‌వేర్‌ కేటాయిస్తోంది.

కేంద్రం దృష్టికి సమస్యలు

కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత.. పిన్‌కోడ్‌ పరిధిలోని ప్రాంతాలు కూడా వేర్వేరు జిల్లాల పరిధిలోకి మారిపోయాయి. లబ్ధిదారుడు కోరుకున్న టీకా కేంద్రం మారడంతో పాటు కొన్నిసార్లు జిల్లా కూడా మారుతోంది. దేశమంతటా ఒకేసారి డ్రై రన్‌ను నిర్వహించడం వల్ల కొవిన్‌ సాఫ్ట్‌వేర్‌ పనితీరులో వేగం తగ్గినట్లు శుక్రవారం నాటి డ్రై రన్‌లో గుర్తించారు. ఈ సమస్యలన్నింటినీ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు వైద్యవర్గాలు తెలిపాయి.

ఇదీ చదవండి : ఒక్కొక్కరికి 2 డోసులు... దుష్ఫలితాల కట్టడికి మూడంచెల ఏర్పాట్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.