ETV Bharat / city

Teachers Union Dharna at Indira Park : జీవో 317 సవరణకు డిమాండ్ చేస్తూ రేపు మహాధర్నా - ఇందిరాపార్కు వద్ద ఉపాధ్యాయ సంఘాల ధర్నా

Teachers Union Dharna at Indira Park : జీవో 317లో పలు అంశాలను సవరించి ఉద్యోగులు, ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 9న హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్​పీసీ) మహాధర్నా చేపట్టనుంది. ఈ ధర్నాకు నష్టపోయిన ఉపాధ్యాయులంతా హాజరు కావాలని యూఎస్​పీసీ స్టీరింగ్ కమిటీ పిలుపునిచ్చింది.

Teachers Union Dharna at Indira Park
Teachers Union Dharna at Indira Park
author img

By

Published : Feb 8, 2022, 6:40 AM IST

Teachers Union Dharna at Indira Park : ఉద్యోగులు, ఉపాధ్యాయుల సర్దుబాటు కోసం విడుదల చేసిన జీవో 317లో పలు అంశాలను సవరించి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 9న ఇందిరాపార్క్‌ వద్ద ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్‌పీసీ) మహాధర్నా చేపట్టనుంది. జీవో 317లో ఉద్యోగుల స్థానికత అంశం ప్రస్తావన లేకపోవడం, ఉద్యోగుల అభ్యంతరాలను, వినతులను పట్టించుకోకుండా కేటాయింపులు జరిపినందున పలువురు శాశ్వతంగా స్థానికతను కోల్పోయి సొంత జిల్లాలకు దూరమయ్యారని యూఎస్​పీసీ నాయకులు చెప్పారు. బాధిత ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని కోరుతూ యూఎస్‌పీసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దశలవారీ పోరాట కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఆ క్రమంలో 9వ ధర్నా చౌక్‌లో మహాధర్నా తలపెట్టామని తెలిపారు. బాధితులు అందరూ హాజరై సమస్య తీవ్రతను ప్రభుత్వానికి తెలియజెప్పాలని కోరారు.

న్యాయం చేయాలి..

Teachers Dharna at Indira Park : పరస్పర బదిలీలకు అవకాశం ఇస్తూ ఇటీవల జీవో 21 ఇచ్చి.. బదిలీపై వెళ్లేవారు మొత్తం సీనియారిటీ కోల్పోవాల్సి ఉంటుందని కిరికిరి పెట్టారని స్టీరింగ్‌ కమిటీ సభ్యుడు, యూటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి విమర్శించారు. డీటీఎఫ్‌ ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం మేల్కొని న్యాయం చేయాలని సూచించారు.

యూఎస్‌పీసీ ప్రధాన డిమాండ్లు

  • జిల్లాల కేటాయింపులో స్థానికతను కోల్పోయిన ఉపాధ్యాయులను ఆప్షన్‌ ప్రకారం వారి సొంత జిల్లాలకు తిరిగి కేటాయించాలి.
  • సీనియారిటీ జాబితాలు, జిల్లాల కేటాయింపులో జరిగిన పొరపాట్లపై అప్పీళ్లను పరిష్కరించాలి
  • కేంద్ర ప్రభుత్వ, పబ్లిక్‌ రంగ సంస్థల ఉద్యోగుల స్పౌస్‌లను కూడా పరిగణలోకి తీసుకోవాలి.
  • అన్ని యాజమాన్యాల టీచర్ల సాధారణ బదిలీలు, పదోన్నతుల నిర్వహణకు షెడ్యూల్‌ ప్రకటించాలి.
  • పరస్పర బదిలీలకు అనుమతిస్తూ ఇచ్చిన జీవో 21లో ఉమ్మడి జిల్లాలో నియామకమైన ఉపాధ్యాయుల సీనియారిటీకి రక్షణ కల్పించాలి.

ఇవీ చదవండి: Unemployment in Telangana : తెలంగాణలోనే నిరుద్యోగులు తక్కువట

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.