Teachers Union Protest : హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేస్తున్న ఉపాధ్యాయ సంఘాలను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. జీవో 317లో సవరణలు చేయడం సహా సమస్యలు పరిష్కరించాలంటూ ధర్నా చేస్తున్న ఉపాధ్యాయులను అరెస్టు చేసి నగరంలోని పలు పోలీస్స్టేషన్లకు తరలించారు. మంగళవారం సాయంత్రం వరకు ధర్నాపై ఏం మాట్లాడని పోలీసులు... అనుమతిలేదంటూ అరెస్టులకు దిగడం సరికాదని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రణాళిక రహితంగా 317 జీవోను అమలు చేయడం పట్ల తీవ్ర ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీల విషయంలో ప్రభుత్వం చేస్తున్న చర్యలకు మహిళా ఉద్యోగులు కన్నీటి పర్యంతమయ్యారు. స్థానికత ఆధారంగా ఉద్యోగాలను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
పిల్లలతో వచ్చిన ఉపాధ్యాయుడు..
అరెస్టులో ఉన్న ఓ ఉపాధ్యాయుడు తన ముగ్గురు పిల్లలను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తీసుకు వచ్చారు. విషయం తెలుసుకున్న ప్రచార మాధ్యమాలు పెద్ద ఎత్తున తరలిరావడంతో పోలీసులు ఆ ఉపాధ్యాయుడితో పాటు పిల్లలను బయటికి పంపించేశారు. తమను అరెస్టు చేసినప్పటికీ ఉద్యమం కొనసాగుతుందని యుటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య పేర్కొన్నారు.
ఇదీ చూడండి : బిల్లులు రావట్లేదని వార్డు సభ్యుడు వినూత్న నిరసన