ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఎస్టీయూ డిమాండ్ చేసింది. తార్నాకాలోని సెయింట్ అన్స్ పాఠశాల వద్ద గంట పాటు పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం నిలిపివేసి నిరసన తెలిపారు. పదవీ విరమణ వయస్సు 61 సంవత్సరాలకు పెంచాలని, మూల్యాంకనం రేట్లు పెంచాలని, ప్రభుత్వ రంగం బలోపేతానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. పీఆర్సీని పాఠశాల పునర్ ప్రారంభానికి ముందే పూర్తి చేసి, నియామక ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు.
ఇవీ చూడండి: ఆందోళన చేసిన రైతన్నలపై కేసులు