ETV Bharat / city

లైవ్ అప్​డేట్స్: ఏపీలో ముగిసిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్‌ - Teacher MLC Election Polling in AP‌

లైవ్ అప్​డేట్స్: ఏపీలో ముగిసిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్

author img

By

Published : Mar 14, 2021, 7:10 AM IST

Updated : Mar 14, 2021, 4:12 PM IST

16:08 March 14

ఏపీలో ముగిసిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్

  •  ఏపీలో ముగిసిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్
  • ఇప్పటి వరకు క్యూలో ఉన్నవారికి ఓటు వేసేందుకు అవకాశం

13:32 March 14

చింతలపూడిలో....

పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చింతలపూడి సీఐ మల్లేశ్వరరావు తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు సౌకర్యాలు కల్పించినట్లు అధికారులు తెలిపారు. ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. చింతలపూడి సర్కస్ పరిధిలోని చింతలపూడి, కామవరపుకోట, లింగపాలెం, టీ నరసాపురం మండలాల్లో 345 ఓట్లు ఉన్నాయని తెలిపారు.

13:32 March 14

అవనిగడ్డ: మధ్యాహ్నం 12 వరకు 40శాతం పోలింగ్

కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. మధ్యాహ్నం 12 గంటల వరకు అవనిగడ్డ కేంద్రంలో 40 శాతం పోలింగ్ నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. అవనిగడ్డ డి.ఎస్.పి మహబూబ్ బాషా పోలింగ్ కేంద్రాలు పరిశీలిస్తున్నారు. కొన్ని కేంద్రాల్లో ఓటింగ్ వేసే ఓటర్లు లేక పోలింగ్ కేంద్రాలు వెలవెలబోయాయి. 

12:15 March 14

చిలకలూరిపేటలో...

గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో కృష్ణా - గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. పట్టణంలోని ఆర్వీఎస్సీఎస్ హైస్కూల్​లోని పోలింగ్ కేంద్రాల్లో.. ఉపాధ్యాయ ఓటర్లు ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 283మంది ఓట‌ర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

12:00 March 14

గుంటూరు జిల్లాలో...

గుంటూరు జిల్లాలో కృష్ణా - గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 4 గంటలకు ముగియనుంది. రెండు జిల్లాల్లో మెుత్తం 111 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 13,505 మంది ఉపాధ్యాయులు ఓటు హక్కుని వినియోగించుకోనున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 19 మంది అభ్యర్థులు ఉన్నారు. ఓటరు తనకు నచ్చిన అభ్యర్ధి పేరుకు ఎదురుగా తొలి ప్రాధాన్యతను సూచిస్తూ.. ఒకటో నెంబర్ అంకె వేయాల్సి ఉంటుంది. తర్వాత క్రమంలో మిగతా వారికి కూడా 2,3,4 అంకెలు వేయవచ్చు. తొలి ప్రాధాన్యమున్న ఓటు వేయకుండా.. 2,3,4 అంకెలు వేస్తే ఆ ఓటు చెల్లదని అధికారులు స్పష్టం చేశారు.

11:59 March 14

పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రశాంతంగా...

ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్వహిస్తున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 11 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిల్చున్నారు. ఎన్నికలకు సంబంధించి 7,765 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 4,716, మహిళలు 3,049 మంది ఉన్నారు. ఈ ఎన్నికలకు సంబంధించి మొత్తం 49 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మండలానికి ఒకటి చొప్పున 48 పోలింగ్ కేంద్రాలు, ఏలూరులో రెండు కేంద్రాలు ఏర్పాటు చేశారు. సెయింట్ జేవియర్ స్కూల్​, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇప్పటి వరకు 23 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్‌ సరళిని అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

10:48 March 14

కొవిడ్ నిబంధనలు పాటిస్తూ...

తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 8 గంటల నుంచే ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ భౌతిక దూరం పాటించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. 

10:48 March 14

రంపచోడవరంలో..

తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం మన్యంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఆర్డీవో సీనా నాయక్ ఆధ్వర్యంలో పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. రంపచోడవరం ఐటీడీఏ పరిధి ఏడు మండలాలలో 541 మంది ఉపాధ్యాయులు ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎనిమిది పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్నికల సర్వే పరిశీలించేందుకు 11 మంది పరిశీలకులను నియమించారు.

10:48 March 14

మందకొడిగా సాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలు

తూర్పు గోదావరి జిల్లా  ముమ్మడివరం నియోజకవర్గంలోని తాళ్ళరేవు, ఐ.పోలవరం, కాట్రేనికోన, ముమ్మిడివరం మండలాల్లో ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు మందకొడిగా సాగుతున్నాయి.. మొత్తం 216 మంది ఉపాధ్యాయులు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు..

10:48 March 14

మైలవరంలో...

కృష్ణాజిల్లా మైలవరంలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. స్థానిక లక్కిరెడ్డి హనిమిరెడ్డి ఉన్నత పాఠశాలలో మైలవరం మండలంలో 106 ఓట్లు ఉన్నాయి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని ఎం.ఆర్.ఓ....ఆర్. వి.వి.రోహిణి దేవి తెలిపారు.

10:47 March 14

మచిలీపట్నంలో..

కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని సెయింట్ ఫ్రాన్సిస్ హైస్కూల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయాన్నే ఉపాధ్యాయులు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

10:47 March 14

ఓటు వేసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు

ఉభయగోదావరి జిల్లాల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ అమలాపురం డివిజన్​లో ప్రశాంతంగా మొదలైంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అమలాపురం డివిజన్ వ్యాప్తంగా 16 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అమలాపురం డివిజ్​లో మొత్తం 2,479 మంది ఓటర్లు ఉన్నారు.

10:47 March 14

గన్నవరంలో..

కృష్ణ జిల్లా గన్నవరం నియోజకవర్గ పరిధిలోని బాపులపాడు, ఉంగుటూరు, గన్నవరం, విజయవాడ రూరల్ మండలాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉపాధ్యాయులు పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

10:47 March 14

కోనసీమలో ప్రశాంతంగా..

ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. కొత్తపేట నియోజకవర్గంలో ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

09:34 March 14

ప్రశాంతంగా కొనసాగుతోన్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌

  • ఏపీలో ప్రశాంతంగా కొనసాగుతోన్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ 
  • ఉభయగోదావరి, కృష్ణా-గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు
  • సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్‌
  • మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 వరకే పోలింగ్‌
  • ఈ నెల 17న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

08:17 March 14

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

  • ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

06:49 March 14

లైవ్ అప్​డేట్స్: ఏపీలో ముగిసిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్‌

  • ఏపీలో నేడు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌

  • ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్‌

  • రెండు స్థానాల నుంచి పోటీలో 30 మంది అభ్యర్థులు
  • కృష్ణా-గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 19 మంది అభ్యర్థులు
  • ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 11 మంది అభ్యర్థులు
  • కృష్ణా జిల్లాలో 51, గుంటూరు జిల్లాలో 60 పోలింగ్‌ కేంద్రాలు
  • తూ.గో. జిల్లాలో 67, ప.గో. జిల్లాలో 49 పోలింగ్‌ కేంద్రాలు

Last Updated : Mar 14, 2021, 4:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.