ETV Bharat / city

వ్యాయామ ఉపాధ్యాయుడిపై సహోపాధ్యాయుల దాడి - గుంటూరు జిల్లా అప్పికట్లలో వ్యాయామ ఉపాధ్యాయుడిపై దాడి న్యూస్

ఏపీలోని గుంటూరు జిల్లా బాపట్ల మండలం అప్పికట్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో.. ఉపాధ్యాయుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ ఘటనలో వ్యాయామ ఉపాధ్యాయుడు వెంకటేష్‌ తలకు తీవ్రగాయమైంది.

వ్యాయామ ఉపాధ్యాయుడిపై సహోపాధ్యాయుల దాడి
వ్యాయామ ఉపాధ్యాయుడిపై సహోపాధ్యాయుల దాడి
author img

By

Published : Dec 29, 2020, 8:09 AM IST

ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు జిల్లా అప్పికట్ల ప్రభుత్వ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిపై సహోపాధ్యాయులు దాడి చేశారు. వ్యాయామ ఉపాధ్యాయుడు వెంకటేశ్ సోమవారం పిల్లలను క్రీడా ప్రాంగణంలో ఆడించడానికి తీసుకువెళ్తుండగా తాము కూడా గ్రౌండ్​కు వచ్చి ఆడతామని సహోపాధ్యాయులు శివయ్య, జయరావు, బుల్లయ్య అన్నారు. విద్యార్థులు, సహోపాధ్యాయులు గ్రౌండ్​కు చేరుకోగానే వారిని ఆడుకోవాలని చెప్పి ఏదో పని మీద వెంకటేశ్ తిరిగి హెచ్​ఎం గది వద్దకు బయలుదేరాడు. తమను గ్రౌండ్​లో ఉంచి నీవు ఏం చేద్దామని వెళుతున్నావని సహోపాధ్యాయులు దుర్భాషలాడుతూ వెంకటేశ్​పై దాడి చేశారు. దీంతో ఆయన పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి, డీఈవో గంగాభవానికి ఫిర్యాదు చేశారు. తనపై శివయ్య, జయరావు, బుల్లయ్య హత్యాయత్నం చేశారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరుపుతామని, అప్పటి వరకూ ముగ్గురు ఉపాధ్యాయులూ సస్పెన్షన్​లో ఉంటారని డీఈఓ తెలిపారు. పాఠశాలలో తమకు తగిన ప్రాధాన్యం లభించకపోవడాన్ని మనసులో పెట్టుకొనే ముగ్గురు ఉపాధ్యాయులు ఈ దాడికి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు.

ఇదీ చదవండి: కర్ణాటక మండలి ఉపసభాపతి ఆత్మహత్య

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.