ఏపీలోని చిత్తూరు జిల్లా పాకాల మండలం కృష్ణాపురంలోని ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఓ ఘటన దుమారం రేపుతోంది. ఉపాధ్యాయుడు కోటేశ్వరరావు... కొంత కాలంగా నడుపుతున్న బాగోతం గురువారం వెలుగుచూసింది. పాఠశాలలోనే మద్యం తాగుతూ... అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అయ్యవారి ఆగడాలు శ్రుతిమించడంతో తల్లిదండ్రులకు గోడు చెప్పుకున్నారు.
పాఠశాలలో ఉపాధ్యాయుడి ప్రవర్తనను సెల్‌ఫోన్‌లో రికార్డు చేసిన తల్లిదండ్రులు.. మండల విద్యాధికారికి పంపారు. సెల్‌ఫోన్‌లో చిత్రీకరించే సమయంలోనూ తల్లిదండ్రులతో ఆ ప్రబుద్ధుడు అనుచితంగా ప్రవర్తించాడు. వీడియో పరిశీలించిన ఎంఈవో బాబ్జీ... ఉపాధ్యాయుడికి మెమో జారీచేసి వివరణ కోరారు. అప్పటివరకు విధులకు దూరంగా ఉండాలని ఆదేశించారు.
- ఇదీ చదవండి : రాష్ట్రంలో మరోమారు భారీగా పెరుగుతున్న కరోనా కేసులు