ETV Bharat / city

TENSION AT CHANDRABABU HOUSE: చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత

ఏపీలోని ఉండవల్లిలో చంద్రబాబు నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఏపీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జోగి రమేశ్ నిరసనకు యత్నించడం, వారిని బుద్దా వెంకన్న సహా ఇతర తెదేపా నాయకులు ప్రతిఘటించే ప్రయత్నం చేయడం.. యుద్ధ వాతావరణాన్ని సృష్టించింది. గొడవ మరింత పెరిగేలా ఉందని భావించిన పోలీసులు.. ఇరువర్గాలను చెదరగొట్టారు. అనంతరం పోలీసులు జోగి రమేశ్​ను అరెస్టు చేసి తీసుకెళ్లారు.

TENSION AT CHANDRABABU HOUSE
TENSION AT CHANDRABABU HOUSE
author img

By

Published : Sep 17, 2021, 10:56 PM IST

TENSION AT CHANDRABABU HOUSE: చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత

వైకాపా ఎమ్మెల్యే జోగి రమేశ్.. కార్యకర్తలతో కలిసి ఉండవల్లిలోని.. చంద్రబాబు నివాసం ముట్టడికి యత్నించడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. జగన్ సహా మంత్రులపై ఏపీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జోగి రమేశ్ నిరసనకు యత్నించడం, వారిని బుద్దా వెంకన్న సహా ఇతర తెదేపా నాయకులు ప్రతిఘటించే ప్రయత్నం చేయడం.. యుద్ధ వాతావరణాన్ని సృష్టించింది. ఇరు పార్టీల నాయకులు పరస్పర నినాదాలు, దూషణలతో.. ఘటనా స్థలం రణరంగాన్ని తలపించింది.

ఏం జరిగింది..

ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. కార్యకర్తలతో కలిసి జోగి రమేశ్ చంద్రబాబు నివాసం వద్దకు వెళ్లారు. వారిని బుద్దావెంకన్న సహా ఇతర తెదేపా నాయకులు ప్రతిఘటించే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో కొందరు వైకాపా కార్యకర్తలు తమ వెంట తెచ్చుకున్న జెండా కర్రలతో దాడి చేసే ప్రయత్నం చేశారు. ఇరువర్గాల మోహరింపుతో ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు బారికేడ్లు పెట్టి ఇద్దరినీ నిలువరించే ప్రయత్నం చేశారు. ఇరువర్గాలూ ఏ మాత్రం వెనక్కి తగ్గకపోవడంతో వారిని నిలవరించేందుకు పోలీసులు కష్టపడ్డారు. లాఠీలు ఝళిపించారు.

జోగి రమేష్, బుద్ధా వెంకన్న మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. చంద్రబాబు ఇంటి దగ్గర నిరసన ఎందుకు చేపడుతున్నారంటూ బుద్ధా నిలదీశారు. అదే సమయంలో తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య పరస్పర నినాదాలతో హోరెత్తించారు. ఇరు పార్టీల నాయకుల మధ్య తోపులాటలు చేటుచేసుకున్నాయి. ఈక్రమంలో బుద్ధా వెంకన్న స్వల్ప అస్వస్థతకు గురై.. సొమ్మసిల్లి కిందపడిపోయారు.

తెదేపా నాయకుల ప్రతిఘటనతో చేసేది లేక జోగి రమేశ్.. కార్యకర్తలతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. ఈ క్రమంలో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఇరువర్గాలూ రాళ్లు రువ్వుకున్నాయి. ఎమ్మెల్యే జోగి రమేశ్ కారు రాళ్ల దాడిలో ధ్వంసం అయ్యింది.

గొడవ మరింత పెరిగేలా ఉందని భావించిన పోలీసులు.. ఇరువర్గాలను చెదరగొట్టారు. అనంతరం పోలీసులు జోగి రమేశ్​ను అరెస్టు చేసి తీసుకెళ్లారు.

జగన్‌ సర్కారు దౌర్జన్యానికి ఇది పరాకాష్ఠ: తెదేపా

ఏపీ డీజీపీ దగ్గరుండి వైకాపా నేతలను చంద్రబాబు ఇంటికి పంపారని తెదేపా నేత పట్టాభి ఆరోపించారు. వైకాపా నేతలు రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. గద్దె రామ్మోహన్‌ మాట్లాడుతూ తెదేపా నేతలపైనే పోలీసులు ప్రతాపం చూపుతున్నారని ఆరోపించారు. పోలీసులే వైకాపా నేతలను ప్రోత్సహిస్తున్నారని.. పోలీసులే బుద్దా వెంకన్నను కింద పడేసి కొట్టారని ఆయన ఆరోపించారు. వైకాపా నేతలు సమాచారం లేకుండా ఆందోళనకు వచ్చారని బుద్దా వెంకన్న అన్నారు. అధికార పార్టీ నేతలు తమపై దౌర్జన్యం చేశారని.. దాడి చేసి కొట్టారని చెప్పారు. జగన్‌ సర్కారు దౌర్జన్యానికి ఇది పరాకాష్ఠ అని ఆయన ఆక్షేపించారు.

ఇదీచూడండి: BJP: భాజపా అధికారంలోకి వస్తే తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుతాం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.