ETV Bharat / city

వైకాపా నాయకుల నుంచి ఉత్తరాంధ్రను కాపాడుకుందాం: అచ్చెన్నాయుడు - తెలుగుదేశం కార్యాలయంలో చర్చాగోష్ఠి

TDP ROUND TABLE MEETING: రాజధాని లేకపోయినా ఏపీ విశాఖ అభివృద్ధి జరుగుతుందని.. దేశంలో ఇప్పటికే అగ్రశ్రేణి పది నగరాల్లో ఒకటిగా ఉందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. మూడు రాజధానులపై ప్రైవేటు బిల్లు పెట్టిన పార్టీ.. ప్రజలను మభ్యపెట్టి, ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించడానికి ప్రయత్నం చేయడం దారుణమన్నారు.

TDP ROUND TABLE MEETING
TDP ROUND TABLE MEETING
author img

By

Published : Oct 15, 2022, 7:50 PM IST

TDP ROUND TABLE MEETING: మూడు రాజధానులపై ప్రైవేటు బిల్లు పెట్టిన పార్టీ.. ప్రజలను మభ్యపెట్టి, ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించడానికి ప్రయత్నం చేయడం దారుణమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్​ విశాఖ తెదేపా కార్యాలయంలో జరిగిన రౌండ్ టేబుల్​ సమావేశంలో ఆయన మాట్లాడారు. ధర్మాన ప్రసాదరావుకి విశాఖ రాజధాని మీద ఎంత ప్రేమ ఉందో తెలుస్తోందని.. భూములు కాజేసిన చరిత్ర ఆయనదన్నారు.

అమరావతి రైతులు ఎలా వస్తారని బొత్స, తమ్మినేని ప్రశ్నిస్తున్నారని అంధ్రప్రదేశ్ మీ జాగీరా అని అచ్చెన్నాయుడు నిలదీశారు. రాజధాని లేకపోయినా విశాఖ అభివృద్ధి జరుగుతుందని దేశంలో ఇప్పటికే అగ్రశ్రేణి పది నగరాల్లో ఒకటిగా విశాఖ ఉందన్నారు. రాజధానిలా లేకపోయినా విశాఖ అభివృద్ధి జరుగుతూనే ఉంటుందన్నారు. మూడు ముక్కలాడితే అభివృద్ధి జరగదని విశాఖలో మొత్తం దోపిడి జరుగుతోందన్నారు.

ప్రజలు తిరగబడకపోతే.. రేపు ఇళ్లలోంచి బయటకు తీసుకువచ్చి ఆక్రమించే పని జరిగినా అశ్చర్యపోనవసరం లేదని అచ్చెన్నాయుడు చెప్పారు . అచ్చెన్నాయుడు ఉత్తరాంధ్ర ద్రోహి అనే దిక్కుమాలిన మాటలు మాట్లాడుతున్నారని.. తెలుగుదేశంపార్టీ, అచ్చెన్నాయుడు ఒకటే మాటమీద ఉంటారన్నారు. అమరావతి రాజధాని, ప్రత్యేక హోదా గురించి ఎప్పుడైనా మట్లాడావా అని జగన్​ని సూటిగా ప్రశ్నించారు.

దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా దిల్లీలో ప్రధానిని కలిస్తే ధైర్యంగా వచ్చి ప్రెస్​మీట్​ పెట్టి తాము అడిగిన విషయాలను చెబుతారని.. కానీ కేవలం తన కేసుల మాఫీ గురించే దిల్లీకి వెళ్లిన జగన్ ఏం చెప్పగలరన్నారని ఎద్దేవా చేశారు. రెండు లక్షల మందితో విశాఖ గర్జన నిర్వహిస్తామని బీరాలు పలికిన వారి గర్జన చూశామని తెలిపారు. విశాఖ ఎప్పుడో ఆర్థిక రాజధానిగా ఉందని.. సిగ్గూ లేకుండా రాజీనామా డ్రామాలు అడుతున్నారని విమర్శించారు. వైకాపా దొంగల నుంచి ఉత్తరాంధ్రను కాపాడుకుందామని అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు.

విశాఖ ఆర్థిక రాజధాని అయ్యేలా కృషి చేద్దాం: అమరావతే ఏకైక రాజధానిగా ఉండాలని.. విశాఖ ఆర్థిక రాజధాని అయ్యేలా కృషి చేద్దామని తెదేపా నేత అయ్యన్నపాత్రుడు ‌అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై విశాఖ తెలుగుదేశం కార్యాలయంలో చర్చాగోష్ఠి నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నేతలందరూ హాజరయ్యారు. మన ప్రాంతానికి వస్తున్న రాజధాని రైతులుకు మన వంతుగా పూర్తి సహకారం అందిచాలని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు.

ఇవీ చదవండి: 'గిరిజన గ్రామాలకు నిధులు, నీళ్లు ఇవ్వడంలో సీఎం కేసీఆర్ విఫలం'

తల్లీబిడ్డలను వేరు చేసిన జర్మనీ ప్రభుత్వం.. దిల్లీలో బంధువుల ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.